Share News

యోగా పండుగ

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:22 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత నెల రోజులుగా జిల్లావ్యాప్తంగా వివిధ చోట్ల ఇప్పటికే యోగాభ్యాసాలు నేర్పించి కొంత అవగాహన కల్పించారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలురికార్డులను బద్దలుకొట్టేలా యోగాను నిర్వహించబోతున్నారు.

యోగా పండుగ
యోగాంధ్ర జరిగే సీఆర్‌రెడ్డి కళాశాల ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

జిల్లాలో 5,617 వేదికల్లో తొమ్మిది లక్షల మందితో యోగాసనాలు

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

జిల్లా కేంద్రం ఏలూరులో మూడుచోట్ల ..జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి 8 ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు యోగాసనాలు

రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు రెండు అవార్డులు

నేడు ప్రధాని చేతుల మీదుగా విశాఖలో విజేతలకు బహుమతులు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత నెల రోజులుగా జిల్లావ్యాప్తంగా వివిధ చోట్ల ఇప్పటికే యోగాభ్యాసాలు నేర్పించి కొంత అవగాహన కల్పించారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలురికార్డులను బద్దలుకొట్టేలా యోగాను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెల్లవారుజాము నుంచి మూడు గంటలపాటు ఏకబికిన అన్ని ప్రాంతాల్లో యోగాభ్యాసం జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులోనే ఒక్కో చోట ఐదువేల మందికి తగ్గకుండా మూడు చోట్ల యోగా నిర్వహణను కలెక్టర్‌ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఒంటికి యోగా మంచిదేగా .. ఇది ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడా మాటను అక్షరాలా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా గిన్నీస్‌రికార్డును అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. నేడు విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్న యోగా వేడుకకు సమాంతరంగా జిల్లాల వారీగా యోగా సానాల్లో వేలాది మంది పాలు పంచుకోబోతు న్నారు. అధికారికంగా యోగాడేను అమలు చేస్తున్నందున దీనికి తగ్గట్టుగానే అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,617 వేదికల్లో దాదాపు 9లక్షల మంది యోగాలో పాలుపంచుకుంటారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గ్రామ,వార్డు సచివాల యా ల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ కార్య క్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మే 21 నుంచి జూన్‌ 21 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వ హించడమే కాకుండా అత్యధికుల్ని ఈ దిశగా నడిపించడంలో యంత్రాంగం కొంత సమర్థత ను ప్రదర్శించింది. దాదాపుగా 9లక్షల మందికి పైగా ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకు న్నారు. యోగాంధ్రకు తాము సిద్ధమేనని సంకల్పం తీసుకున్నారు. ప్రత్యేకించి జిల్లాలో యోగాభ్యాసనం చేయడానికి అనువుగా 100 మంది మాస్టర్‌ ట్రైనర్లు, ఇంకో 6వేల మందికి పైగా శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. సుమారు ఆరు నిమిషాల పాటు శారీరక కదలికలపై అభ్యసనాలు, మరో 25 నిమిషాల వివిధ యోగాసనాలు అనంతరం స్టాండింగ్‌ ఆసనాలు నిర్వహించేందుకు వీలుగా సన్నద్ధం చేశారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు యోగాభ్యాసన జిల్లా అంతా కొనసాగుతుంది. ప్రత్యేకించి జిల్లా కేంద్రం ఏలూరులోనే ఈ కార్యక్రమం ఘనం గా జరిగేలా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణ, ఇండోర్‌స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంల్లో ఒక్కోచోట ఐదువేల మందికి తగ్గకుండా యోగాభ్యాసానాలు చేస్తారు.

యోగాంధ్రలో పాల్గొనండి

కలెక్టర్‌ వెట్రిసెల్వి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెట్రిసెల్వి వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 9లక్షల59వేల635 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పటికే యోగాపై పూర్తి అవగాహనకు వచ్చిన వారంతా శనివారం జరగబోయే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటు న్నారన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఎలా అమలు చేయబోతున్నామో వివరించారు. ఇప్పటివరకు యోగాభ్యాసనాల్లో 7లక్షల79వేల657 మంది పాల్గొనగా, వారందరికి సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అదే విధంగా లక్షా82వేల644 మందికి ఎక్సలెన్సీ సర్టిఫికెట్లను అందజేశామని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో స్కిట్‌ అండ్‌ రోల్‌ప్లే, యోగా స్లోగన్స్‌ విభాగాల్లో మన జిల్లా ప్రథమ స్థానం పొందిందని విజేతలకు విశాఖలో జరిగే యోగా వేడుకల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా ఉత్సాహంతో కదలి రావాల్సిందీ ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, ఏవో నాంచారాయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:25 AM