చలో అమరావతి
ABN , Publish Date - May 01 , 2025 | 11:47 PM
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి అనువుగా నేడు జరుగుతున్న కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు.
రాజధాని పునఃనిర్మాణానికి నేడు శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు
భారీ సంఖ్యలో వాహనాలు వేలాదిగా తరలి వెళ్లనున్న ప్రజలు
అందుబాటులో మంచినీరు, మజ్జిగ.. దారి మధ్యలోనే భోజనాలు
అధికారుల పర్యవేక్షణ.. పక్కాగా ఏర్పాట్లు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి అనువుగా నేడు జరుగుతున్న కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఇప్పటికే అధికారులు కలుగజేసుకుని ఏ ప్రాంతం నుంచి ఏ వాహనం, ఏ సమయంలో బయలు దేరుతుందో, తిరిగి, ఏ సమయానికి స్వస్థలాలకు చేరుకుంటామో అనే సమాచారాన్ని ఎక్కడిక్కడ అందించారు. లోపాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు.
(భీమవరం/ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి నిర్మాణానికి అనువుగా కోట్ల రూపాయల విలువైన పనులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మహాఘట్టానికి స్వయంగా హాజరవ్వడానికి వీలు గా ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అమరావతి బాట పట్టేందుకే అంద రూ ఉత్సాహం చూపిస్తున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారథి ప్రాతినిఽథ్యం వహిస్తున్న పాలకొల్లు, నూజివీడు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున అమరావ తికి తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. స్థానికుల తోపాటు పార్టీల్లో వివిధ హోదాల్లో ఉన్న వారం తా శుక్రవారం అమరావతి తరలి వెళ్లేలా సన్నద్ధ మయ్యారు. ఏలూరు, దెందులూరు, చింతల పూడి, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, ఉండి, ఆచంట నియోజక వర్గాల నుంచి ఊహించిన దానికంటే అధికంగా నే రాజధానికి వెళ్లేందుకు అత్యధికులు ఉత్సాహం ప్రదర్శించారు. దీంతో వాహనాలు సరిపోతాయా లేదా అనే సందేహాలు కొందరు లేవనెత్తారు. ఉప సభాపతి రఘరామకృష్ణరాజు తన నియోజ కవర్గ నుంచి పెద్దఎత్తున ఏర్పాట్లుచేశారు. అమరావతికి వెళ్లే వారి సౌకర్యార్థం ప్రభుత్వం తగు ఆదేశాలు జారీచేసింది. స్థానికంగా ప్రజల తో బయలుదేరే ప్రతీ వాహనంలో ఎప్పటిక ప్పు డు పరిస్థితిని సమీక్షించేలా, అవసరమైతే సాయ పడేలా ఓ అధికారిని అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ వాహనంలోను మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకున్నారు. జాతీయ రహదారి పొడవునా వీలైనంత మేర మజ్జిగ, మంచినీరు దూరప్రాంతాల నుంచి వస్తున్న వారి కి నేరుగా అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వాహనాలు గమ్య స్థానాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
500 బస్సులు కేటాయింపు
విద్యార్థులకు సెలవులు కావడంతో జనాన్ని తరలించడానికి పాఠశాలల బస్సులను వినియో గిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 500 బస్సులు కేటాయించారు. ఇందులో 250 ఎన్టీఆర్ జిల్లాకు, 100 కృష్ణా జిల్లాకు తరలించారు. మన జిల్లా నుంచి 150 బస్సుల్లో ప్రజలు తరలి వెళ్లే లా ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్లే జనం కోసం రెండు మార్గాలను ఎంపిక చేశారు. ఒకటి జాతీయ రహదారి మీదుగా గన్నవరం నుంచి అమరావతి చేరుకుంటాయి. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట నియోజకవర్గాల నుంచి ప్రజలు గన్నవరం మీదుగా వెళ్లేలా ఏర్పాటు చేశారు. పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల ప్రజలు ఉయ్యూరు మీదుగా అమరావతి చేరుకుంటారు. జిల్లా నుంచి బస్సుల్లో వెళ్లే జనాల కోసం గన్నవరం, ఉయ్యూరులో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండుచోట్ల ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.
అమరావతి సభకు ప్రజా స్పందన : నిమ్మల
పాలకొల్లు అర్బన్, మే 1(ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు శుక్రవారం అమరావతి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది హాజరు కానున్నారని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని ఆయన కార్యాలయంలో గురు వారం కూటమి ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రం దిశ, దశ మార్చే చారిత్రక సభకు హాజరయ్యేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రధాని సభకు తరలి వెళ్ళేందుకు ప్రజా స్పందన అద్భుతంగా ఉందన్నారు. పాలకొల్లు నుంచి ప్రధాని సభకు 25 బస్సులు, 120 కార్లతో ఐదు వేల మందికిపైగా తరలి వెళుతున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జీవీ, ఎం.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.