నేడు కేంద్ర బృందం రాక
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:51 AM
జిల్లాలో మొంథా తుఫాన్ తీవ్రంగా పంట నష్టాలను మిగిల్చిం ది. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఈనెల 10వ తేదీ సోమవారం జిల్లాలో పర్యటించ నుంది.
మొంథా తుఫాన్ పంట నష్టాలపై పరిశీలన
ఉంగుటూరు మండలంలో పర్యటన
జిల్లాలో 5704,24 హెక్టార్లలో పంట నష్టం అంచనా
ఏలూరుసిటీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి):జిల్లాలో మొంథా తుఫాన్ తీవ్రంగా పంట నష్టాలను మిగిల్చిం ది. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఈనెల 10వ తేదీ సోమవారం జిల్లాలో పర్యటించ నుంది. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బృందంలో కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ , హైదరాబాద్‌కు చెందిన డా.కె.పొన్నుస్వామి, సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఆర్తిసింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అండర్ సెక్రటరీ మనోజ్‌కుమార్ మీనా సభ్యులుగా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి నాలుగు గంటలకు ఉంగుటూరు మండలానికి ఈ బృందం చేరు కుంటుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. ఉంగుటూరులో తుఫాన్ నష్టాలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన పునరుద్ధరణ చర్యలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఉం గుటూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫా న్ నష్టాలను పరిశీస్తుంది. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి బృందం బయలుదేరి వెళ్తుంది.
5704.24 హెక్టార్లలో పంటనష్టం
మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో 5704.24 హెక్టార్లలో వరితో పాటు ఇతర పంటలు నష్టపోయిన ట్టు జిల్లా వ్యవసాయ శాఖ పంట నష్టాల సర్వే అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో వరి పంట 4807.37 హెక్టార్లలో నష్టపోగా మినుము 859.21 హెక్టార్లు, పత్తి 33.11 హెక్టార్లు, పెసలు 2.23 హెక్టార్లు, అలసంద 0.70 హెక్టార్లు, వేరుశనగ 1.62 హెక్టార్లలో నష్టపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో 25 మండలాల్లో పంట నష్టాలు జరగగా, 11,613 మంది రైతులు పంట నష్టపోయారు. ముదినే పల్లి మండలం 831.96 హెక్టార్లు, పోలవరం 725.80 హెక్టార్లు, దెందులూరు 634.40 హెక్టార్లు, ఉంగుటూరు 443.37 హెక్టార్లు, మండవల్లి 400.99 హెక్టార్లు, పెద పాడు 337.44 హెక్టార్లు, భీమడోలు 279.68 హెక్టార్లు, పెదవేగి 264.71 హెక్టార్లు, ఆగిరిపల్లి 260.57 హెక్టార్లు, కొయ్యలగూడెం 238.17 హెక్టార్లు, నూజివీడు 234.01 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం 229.18 హెక్టార్లు, నిడమర్రు 229.09 హెక్టార్లు, వేలేరుపాడు 95.69 హెక్టార్లు, చింతలపూడి 84.62 హెక్టార్లు, ద్వారకాతిరుమల 73.36 హెక్టార్లు, ముసునూరు 71.50 హెక్టార్లలో వరితోపాటు ఇతర పంటలు నష్టపోగా మిగిలిన మండలాల్లో 50 హెక్టార్ల కంటే తక్కువగానే పంట నష్టం వాటిల్లింది. పంట నష్టాల ప్రాతిపదికగా రైతులకు పంట నష్టపరి హారం చెల్లించే అవకాశాలున్నాయి. తాజాగా కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తుండడంతో రైతులు తమ గోడు విన్పించేందుకు సన్నద్ధమవు తున్నారు.