Share News

ఆటో డ్రైవర్లకు అండగా..

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:24 AM

‘ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది. గత దీపా వళికి ఉచిత గ్యాస్‌ పథకాన్ని అమలు చేయగా.. ఇప్పు డు దీపావళికి ముందుగానే ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాం.

ఆటో డ్రైవర్లకు అండగా..
ఆటోడ్రైవర్లకు చెక్కు అందజేస్తున్న మంత్రి మనోహర్‌, ఎమ్మెల్యే చంటి, కలెక్టర్‌ వెట్రిసెల్వి, మేయర్‌ నూర్జహాన్‌, విజయవాడ జోనల్‌ ఆర్టీసీ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు

‘ఆటో డ్రైవర్ల సేవలో’ సభలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఏలూరు,అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది. గత దీపా వళికి ఉచిత గ్యాస్‌ పథకాన్ని అమలు చేయగా.. ఇప్పు డు దీపావళికి ముందుగానే ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాం. ఆటోలపై విధించే అపరాధ రుసుం తగ్గించేలా సీఎం దృష్టికి వివరిస్తా’ అంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఏలూరు కోటదిబ్బ జూనియర్‌ కళాశాల ఆవరణలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఆటోడ్రైవర్లకు రూ.15వేల ఆర్థికసాయం జమ చేసేందుకు చెక్కును లబ్ధిదారులకు శనివారం ఆయన అందజేశారు. ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ‘అభివృద్ధి.. సంక్షేమ పథకాల్లో రాజ కీయాలకు అతీతంగా ఏలూరు జిల్లాను ముంద ంజలో నిలుపుతాం. ఈ విషయంలో వెనుకడుగు అనేది లేనే లేదు. ఏడాదిలోపే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏలూరు పోటీపడేలా చేసి టాప్‌–5లోకి చోటు కల్పించే దిశగా సర్వం సిద్ధం చేస్తున్నాం. గతేడాది 46 వేల కోట్లను సంక్షేమ పథకాలకు వెచ్చించాం. ప్రతీ నెల 2,712 కోట్ల పెన్షన్లు అందిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 10,655 మంది ఆటోడ్రైవర్లకు రూ.15కోట్ల 98లక్షల 25వేల ఆర్థిక సాయం జమ అవుతుం దన్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లా డు తూ ఆటోడ్రైవర్లకు కొత్త పథకం అమలు చేయ డంలో ప్రభుత్వం ఘనత అనిర్వచనీయమన్నారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, విజయవాడ జోనల్‌ ఆర్టీసీ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడులు మాట్లాడారు. ముఖ్య మంత్రి చంద్రబాబు విజయవాడలో పాల్గొన్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని సభావేదిక వద్ద ప్రత్యక్ష ప్రసారం చేశారు. డీఆర్వోవో వి.విశ్వేశ్వరరావు, వాణిజ్య పన్నులశాఖ జాయింట్‌ కమిషనర్‌ బి.నాగార్జునరావు, ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌, డీటీసీ షేక్‌ కరీమ్‌, ఏలూరు కమిషనర్‌ భానుప్రతాప్‌, సమగ్ర శిక్ష జిల్లా కో–ఆర్డి నేటర్‌ పంకజ్‌కుమార్‌, ఏలూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్ర మ్‌ కిశోర్‌, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. కాగా తొలుత నగరంలో పలుచోట్ల నుంచి ఆటోడ్రైవర్లు వాహనాలతో ర్యాలీగా సభాప్రాంగణానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అగ్రహారం నుంచి ఆటోను ఎమ్మెల్యే బడేటి చంటి నడపగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆటోలో కూర్చుని సభా వేదికకు వచ్చారు. ఎమ్మెల్యే పూర్తిగా ఆటో వాలా డ్రెస్‌ ధరించగా మేయర్‌,ఇతర ప్రజాప్రతినిధులు ఖాకీ షర్టులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated Date - Oct 05 , 2025 | 12:24 AM