Share News

కైకలూరులో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:06 AM

కైకలూరు కరకట్ట ప్రాంతంలో వినాయక ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం శనివారం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న విషయం విదితమే.

కైకలూరులో ఉద్రిక్తత
కైకలూరు బైపాస్‌ రోడ్డులోని వినాయకుడి గుడివద్ద శుక్రవారం రాత్రి కర్రలు, రాడ్‌లతో యువకులు

ఇరువర్గాల ఘర్షణ..

ఇద్దరికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై

దానగూడెం గ్రామస్థుల ఆందోళన

జనసేనకు చెందిన

ఏడుగురిపై అట్రాసిటీ కేసు

కైకలూరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): కైకలూరు కరకట్ట ప్రాంతంలో వినాయక ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం శనివారం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న విషయం విదితమే. ఎప్పుడూ లేనివిధంగా కైకలూరులో వంద లాదిమంది యువకులు కర్రలు, రాడ్లతో రహదారు లపై సంచరించడం శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే..

కైకలూరు కరకట్ట ప్రాంతంలో గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా వినాయకుడి విగ్రహం ఏర్పాటు సమ యంలోనే జనసేనకు చెందిన యువకులకు, కైకలూ రు శివారు దానగూడెం చెందిన యువకులతో వివాదం ఏర్పడింది. గత నాలుగైదు రోజులుగా చిన్నపాటి వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి నిమజ్జన ఊరేగింపులో మరల ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దాన గూడెంకు చెందిన గొంతుపులి దినేష్‌బాబు, పైఎద్దు అజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కైకలూ రు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్తతల నడుమ ఎలాంటి అవాంతరాలు లేకుండా భారీ బందోబస్తుతో పోలీసులు నిమజ్జనం జరిపించారు. విషయం తెలిసి ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

దానగూడెం వాసుల ఆందోళన

శనివారం ఉదయం దానగూడెంకు చెందిన యు వకులు పెద్దఎత్తున పోలీసు బందోబస్తును తప్పిం చుకుని జాతీయ రహదారిపైకి వచ్చారు. వారపు సంత సమీపంలో ధర్నా చేసేందుకు ప్రయత్నిం చగా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత నేతలు వారికి మద్దతు పల కడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి బైపాస్‌రోడ్డులోని వినాయకుని గుడి వద్ద మరోసారి దానగూడెంకు చెందిన యువకులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ఒక్కసారిగా పోలీసు రోప్‌ను తోసుకుంటూ ర్యాలీగా తాలుకా సెంటర్‌కు చేరుకుని మహిళలతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దాడులకు పాల్ప డిన జనసేన నాయకులను తక్షణమే అరెస్టు చేయా లని నినాదాలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అభిమాను లమని ఎన్నికల్లో కూటమి పార్టీకి మద్దతు తెలిపా మని, అయినా దళితులపై వివక్ష చూపుతూ దాడులకు పాల్పడ్డారని నిరసన వ్యక్తం చేశారు. సమీపంలోని జనసేన ఫ్లెక్సీలను మహిళలు చింపివేశారు. మళ్లీ ఆందోళనకారులు అక్కడ నుంచి వారపు సంత దగ్గరకు ర్యాలీగా వచ్చి రహదారిపై బైఠాయించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని లాఠీచార్జి చేసి చెదరగొట్టి దానగూడెం పంపివేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ దళిత సంఘాల నేతలతో మాట్లాడి ఆందోళన విరమింపచేసేలా చొరవ చూపారు. మరోవర్గాన్ని శనివారం ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా ముందస్తుగానే ఎక్కడికక్కడే కట్టడి చేశారు.

ఏడుగురిపై అట్రాసిటీ కేసు నమోదు

దానగూడెంకు చెందిన యువకులపై దాడులకు పాల్పడిన జనసేనకు చెందిన తులసీ శివ, తోట కార్తీక్‌, తులసీ పూర్ణ, మెకానిక్‌ శివ్‌, పోతునూరి బాలు, పిచ్చుకల రాజేష్‌, కొల్లి వరప్రసాద్‌లపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు కైకలూరుటౌన్‌ సీఐ పి.కృష్ణ తెలిపారు.

దానగూడెం గ్రామస్థులకు కూటమి నేతల పరామర్శ

దానగూడెం గ్రామస్థులను శాంతింప చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు కూటమి నేతలు శనివారం సాయంత్రం పరామర్శించారు. దాడికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాడ్లు, కర్రలు, కత్తులతో దాడులకు పాల్పడుతూ దానగూడెం నుంచి కైకలూరు టౌన్‌లోనికి వెళ్లడానికి చిన్నపిల్లలు భయపడే పరిస్థితులకు తీసుకొచ్చారని కక్షపూరితంగా మాపై దాడులకు పాల్పడ్డారని పోలీసులు ఏకపక్షంగా నిలిచారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాఽధితులమైన మాపై లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతో నాయకులు పూర్తిస్థాయిలో పోలీసులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి నేతలు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, పెన్మెత్స త్రినాథరాజు, పీజేఎస్‌ మాల్యాద్రి, పొత్తూరి వాసురాజు, బలే ఏసురాజు, కేకే బాబు, పేరిచర్ల ప్రసాదరాజు, వీరాబత్తిన సుధా, పడమటి వాసు, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:06 AM