గుడులు కట్టేద్దాం..!
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:26 AM
బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో భజన మందిరాలు, దేవాలయాల నిర్మాణాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్టు నిధులు మం జూరుచేస్తోంది. ఎవరైనా ఆలయాలు నిర్మా ణం చేయదలుకుంటే దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
ఆలయాలు, భజన మండళ్ల నిర్మాణాలకు టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులు
స్థలాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కేటాయింపు
దరఖాస్తులు స్వీకరిస్తున్న దేవదాయ శాఖ
భీమవరం టౌన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో భజన మందిరాలు, దేవాలయాల నిర్మాణాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్టు నిధులు మం జూరుచేస్తోంది. ఎవరైనా ఆలయాలు నిర్మా ణం చేయదలుకుంటే దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులను సంప్రదించాలి. దీనికి సం బంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇటీ వల దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్లు, అఽధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా సమీక్షించారు. శ్రీవాణి ట్రస్టు రాక ముందు వరకు కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) ద్వారా దాతలు 33 శాతం నిధులు విరాళంగా ఇస్తే దానికి ప్రభుత్వం 67 శాతం నిధులు కలిపి నిధులు విడుదల చేసి ఆలయాల నిర్మాణాలు చేపట్టేది. ప్రస్తుతం ఈ విధానం కొనసాగుతున్నా ఎటువంటి నిధులు చెల్లించకుండా శ్రీ వాణి ట్రస్టు ద్వారా ఆలయాలను అభివృద్ధి చేస్తారు. ఆసక్తి వున్న వారు దరఖాస్తును దేవదాయ శాఖకు చేసుకోవాలి. అనుమతిం చిన ఆలయాలు, భజన మందిరాలను దేవ దాయ శాఖ అందజేసిన నమూనా ప్రకారం గ్రామస్తులు, కాలనీ పెద్దలు నిర్మించుకోవచ్చు. స్ధలాన్ని బట్టి రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు మంజూరవుతాయి. గతంలో రూ.10 లక్షల వరకే ఇచ్చేవారు.
ఇప్పటికే 33 ఆలయాలు నిర్మాణం
గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా జిల్లాలో 33 దేవాలయాలు నిర్మించా రు. ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల చొప్పు న మూడు కోట్ల 30 లక్షలు విడుదల చేశారు. వీటిలో పొన్నపల్లి, కలిగొట్ల, చింతలతోట, గుమ్మలూరు, తణుకు, రేలంగి, శృంగవృక్షం, ఆలమూరు, కరుగోరుమిల్లి, జగన్నాధపురం, కవురువారిపాలెం, గొల్లగూడెం, వెలివెల, వెంప, వెంకటాపురం, కొఠాలపర్రు, ములపర్రు, పోలవరం, పండితవిల్లూరు, ఇలపకుర్రు, కొడమంచిలి, సద్దు కడపలలో రామాలయా లు, గుంపర్రు, కొప్పర్రు, పాలకొల్లుల్లో ఆంజ నేయస్వామి ఆలయాలు, పాలమూరులో ము రళీకృష్ణ ఆలయం, లిఖితపూడిలో తాళ్లమ్మ, రుస్తుంబాదలో అంకాలమ్మ, వరిదానంలో నేరేళ్ళమ్మ, సిద్దాపురంలో శివాలయం, నాగిడిపా లెంలో భజన మందిరం, గరగపర్రులో వర సిద్ధి వినాయకుడి ఆలయాలు నిర్మించారు.
ఎక్కడ నిర్మించుకోవచ్చు
కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రాధాన్యత.
దేవాలయాలు లేని, దూరంగా వున్న ప్రాంతాలకు ప్రాధాన్యత.
జీర్ణోద్ధారణ దేవాలయాల పునరుద్ధరణకు శ్రీవాణి నిధుల మంజూరు.
స్థలాన్ని బట్టి మూడు కేటగిరీలు
ఏ కేటగిరిలో రూ.10 లక్షలు
బీ కేటగిరిలో రూ.15 లక్షలు
సీ కేటగిరిలో రూ.20 లక్షలు
మంజూరైన నిధులు మూడు విడతలుగా ఆలయాల కమిటీలకు అందజేత.
దరఖాస్తులు చేసుకోవచ్చు
శ్రీ వాణి ట్రస్టు ద్వారా భజన మండళ్లు, ఆలయాల నిర్మాణాలకు స్థలం ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చునని దేవదాయ ధర్మదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాశ్ తెలిపారు. ట్రస్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామన్నారు.