Share News

లెక్కలేనితనం

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:29 AM

దేవుడి ఆస్తుల కింద ఆలయాల అభివృద్ధి చేయాల్సిన సిబ్బంది, అధి కారులే లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఆదాయాలను హరిస్తున్నారు. ఇతర భూముల ద్వారా లీజులు వసూళ్లు, ఇతర చెల్లింపుల్లో ఆడిట్‌ అభ్యంతరాల్లో దేవదాయశాఖ బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తోంది.

లెక్కలేనితనం
ఏలూరులోని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం

రూ.60.43 కోట్లకు లెక్కా ..పత్రాల్లేవ్‌

దేవదాయశాఖలో ఆడిట్‌ అభ్యంతరాలు కోకొల్లలు

ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే అభ్యంతరాలు

సమీక్షలకు తీరిక లేని ఆ శాఖ అధికారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

దేవుడి ఆస్తుల కింద ఆలయాల అభివృద్ధి చేయాల్సిన సిబ్బంది, అధి కారులే లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఆదాయాలను హరిస్తున్నారు. ఇతర భూముల ద్వారా లీజులు వసూళ్లు, ఇతర చెల్లింపుల్లో ఆడిట్‌ అభ్యంతరాల్లో దేవదాయశాఖ బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తోంది. ఈ శాఖలో ఏళ్లతరబడి ఆడిట్‌లు సక్రమంగా లేకపోవడంతో కోట్లాది రూపాయల దేవదాయం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దేవుడంటే భయపడాల్సిందీ పోయి, దేవదాయ శాఖలోనే ఈవోలు, కిందస్థాయి సిబ్బంది చేతి వాటం, ఉత్సవాల పేరిట భారీగా నిధులు కైంకర్యం చేసేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులను మించి హారతి కర్పూరంలా వాడే సిన బాపతు కింద జిల్లాలో 144 దేవాలయాలు, సత్రాల పరిధిలో 16,843 ఆడిట్‌ అభ్యంతరాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ.60.40 కోట్ల సొమ్ము లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో నూరు శాతం అవినీతి, అక్రమాలు జరిగాయడానికి లేదు. బడ్జెట్‌కు మించి ఉత్సవాలు, ప్రసాదాలు, ఇతర ఏర్పాట్లకు ఖర్చు చేయడం, ఆలయాలకు సంబం ధించి మక్తాలు, కౌలు, లీజులు వ్యవహారాల్లో సకాలంలో వాటిని శాఖపరంగా జమ చేయకపోవ డమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఇందులో ర్యాటిఫికేషన్‌ పరిధిలోను సరిదిద్దుకునేవి ఉంటాయి. వాటి జోలికెళ్లడం లేదు సరికదా అసలు తామేమి చేశామో అన్న అంశంపై లెక్కలు సమ ర్పించి ఆడిట్‌ అభ్యంతరాలు సరిదిద్దుకోవాలని ఆడిట్‌శాఖ అధికారులు కోరుతున్న ఈ విషయంలో లెక్కలేనితనంగా ఈవోలు, సిబ్బంది వ్యవహరిస్తు న్నారు. జిల్లా వ్యాప్తంగా 713కు పైబడి దేవాల యాలు, సత్రాలు ఉన్నాయి. వీటిల్లో 144 దేవాల యాలు, సత్రాల నుంచి ఆడిట్‌ అభ్యంతరాలు గత 30 ఏళ్ల నుంచి కొనసాగుతుండడం గమనార్హం.

సరిచేసుకుంటున్నది వేళ్ల పైనే..

జిల్లాలో ఓ మోస్తరు ఆదాయం వచ్చే ఆలయా లైన ద్వారకాతిరుమల, పట్టిసీమ వీరేశ్వర స్వామి దేవాలయం, జంక్షన్‌ అభయాంజనేయ స్వామి, ఆగిరిపల్లి శోభానాచలం, గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయం, ఏలూరు ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఏదైన అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే అక్కడ ఈవోలు, సిబ్బంది వాటిని సరిచేసు కుని, సకాలంలో పత్రాలు సమర్పించుకుని సరి దిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగతావారు మాకేమీ అవుతుందీలే, ఇది మాది కాదనంటూ వ్యవహరిస్తూ మొండిగా వ్యవహరిస్తున్నారు. దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయిల్లోనే సమావేశాలు జరిగినప్పుడు ఆడిట్‌ అభ్యంతరాలను పరిష్కరించుకోవాలన్న దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారన్న విమర్శలు లేకపోలేదు.

నవంబరులోగా పరిష్కరించుకోవచ్చు

ఏటేటా ఆలయాల పరిధిలో ఆడిట్‌ అభ్యంత రాలు పెరిగిపోతున్నాయే తప్ప తరగడం లేదు. ఈ విషయంలో దేవాలయాలకు సంబంఽధించి ఏటా జూలై నుంచి నవంబరు వరకు నాలుగు నెలలు కాలం పైబడి ఇద్దరు సహాయ ఆడిట్‌ అధికారులు, జిల్లాలోని 20 మంది సీనియర్‌ ఆడిటర్లు పర్య వేక్షణలో ఆలయాల్లో ఆడిటింగ్‌ చేస్తుంటాం. ఈ నేపథ్యంలో ఆలయాలకు సంబంధించి వ్యక్తమైన అభ్యంతరాలను మీ వద్దకు వచ్చినప్పుడు పరిష్క రించుకోవాలి. ఈదిశగా ఈవోలు, సత్రాల సిబ్బంది శాఖపరంగా సహకరిస్తే వేగంగా అభ్యంతరాలు పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నాము.

– ఏవీఆర్‌ గంగాధరరావు, జిల్లా ఆడిట్‌ అధికారి

Updated Date - Jul 31 , 2025 | 12:29 AM