పోలీసు నీడలో ప్రత్తిపాడు శివాలయం
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:31 AM
పెంటపాడు మండలం ప్రత్తిపాడు శివాల యం రెవెన్యూ శాఖ స్వాధీనంలోకి వెళ్లింది.
సెక్షన్ 164 విధింపు
స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
పరదా కట్టిన పంచాయతీ సిబ్బంది
సస్పెండైన అధికారుల స్థానంలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పెంటపాడు మండలం ప్రత్తిపాడు శివాల యం రెవెన్యూ శాఖ స్వాధీనంలోకి వెళ్లింది. గ్రామంలో వివాదం జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఆలయ నిర్మాణంపై గ్రా మానికి చెందిన ఇద్దరు భూ యజమానులు వేసిన పిటిషన్‌పై ప్రభుత్వ భూములు పరి రక్షించాలంటూ హైకోర్టు ఆదేశించింది. అయి నప్పటికి నిర్మాణం నిలుపుదల చేయలేదం టూ కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఈ నేప థ్యంలో ఆలయంలో విగ్రహాలు పెట్టేయడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి రెవెన్యూ, పంచాయతీ రాజ్‌కు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసి వారి స్థానంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. పెంటపాడు ఇన్‌ఛార్జ్ తహ శీల్దార్‌గా గణపవరం తహశీల్దార్ అప్పారావు కు బాధ్యతలు అప్పగించారు. మండల ఇన్ చార్జి ఈవోపీఆర్‌డీగా పెంటపాడు కార్యదర్శి బాలకృష్ణ, ప్రత్తిపాడు ఇన్‌చార్జి కార్యదర్శిగా అలంపురం గ్రామ కార్యదర్శి కొండలరావు, ఇన్‌చార్జి వీఆర్‌వోగా జట్లపాలెం వీఆర్‌వో రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు.
వివాదం వెనుక
గ్రామంలో విరాళాలు సేకరించిన ఆలయా న్ని నిర్మిస్తున్నారు. ఆలయానికి ఆనుకుని ఓ నివాస స్థలం ఉంది. దానిపై నీడ పడుతుం దంటూ స్థల యజమాని నిర్మాణదారులతో సంప్రదింపులు జరిపారు. సదరు స్థలాన్ని కొనుగోలు చేయడానికి నిర్మాణదారులు సిద్ధ మయ్యారు. ధర నిర్ణయంలో తేడాలు రావ డంతో అవి ఆగిపోయాయి. మరోవైపు ఆల యానికి ఆనుకుని వ్యవసాయ భూమి ఉంది. ఆలయ నిర్మాణం వల్ల తమ పొలానికి నీరు ఆగిపోయిందంటూ ఓ రైతు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పంచాయతీ గ్రామంలోని నిర్మాణ దారులకు నోటీసులు ఇచ్చింది. పోలీ సులకు ఫిర్యాదు చేస్తే కేసు నమో దు చేశారు. ఇంకోవైపు నిర్మాణం జరుగుతుందంటూ హైకోర్టులో నమోదైన కేసు జనవరి 5న విచారణకు రానుంది. ఈ క్రమంలో నిర్మాణం నిలిచి పోవాలి. నిర్మాణదారులు కంగారుపడ్డారు. శాస్ర్తోక్తంగా ప్రతిష్టించాల్సిన దేవతామూర్తులను గుట్టు చప్పుడు కాకుండా ఆలయంలో పెట్టేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. నలుగురు అధికారుల ను సస్పెండ్ చేశారు. ఆలయాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు భారతీయ న్యాయ శిక్షాస్మృతి (బీఎన్‌ఎస్‌ఎస్) 164 సెక్షన్ విధించారు. పగలు, రాత్రి పోలీ సులు గస్తీ ఉండేలా చర్యలు తీసుకున్నారు.
స్థలం ఎవరిది
ఆలయం నిర్మిస్తున్న స్థలం ఎవరిదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం స్థలం ఎవరిదనేది నిర్ధారించేందుకు జిల్లా పరిషత్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధి కారులకు పోలీసులు లేఖలు రాశారు. అది తమది కాదంటూ మూడు శాఖల నుంచి సమాధానం అందినట్టు సమాచారం. నీటిపా రుదల శాఖ నుంచి వివరాలు రావాలి. ఇలా స్థలంపై సందిగ్ధత నెలకొంది. ప్రత్తిపాడుకు శివాలయం ఉండాలన్న ఉద్దేశంతో కొందరు గ్రామస్థులు ప్రజల నుంచి విరాళాలు సేక రించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఖాళీ స్థలంలో నిర్మాణం చేపట్టారు. హైకోర్టు లో కేసుల నమోదుతో వివాదాస్పదమైంది.
ఓపిక పట్టాల్సింది..!
కేసు తేలే వరకు నిర్మాణదారులు ఓపిక పట్టా ల్సింది. ఆలయంలో శివ లింగం, గణపతి, అమ్మవా ర్ల దేవతామూర్తులను ఏర్పాటుచేశారు. ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసు ఉండగా దేవతామూర్తులను నెలకొల్పడంతో అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కేసులో ప్రతివాదిగా ఉన్న జిల్లా కలెక్టర్ నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ అప్పారావు పెంటపాడు మండల వీఆర్‌వోలతో సమీక్ష నిర్వహిం చారు. రాత్రి పగలు పహారా ఉండాలంటూ వీఆర్‌వోలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ, రూరల్ సీఐ, పెంటపాడు ఎస్‌ఐలు ఆలయాన్ని పరిశీలించారు. గ్రామం నుంచి ఏ ఒక్కరూ ఆలయాన్ని సందర్శించకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.