విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:56 AM
విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని, వినూత్న పరిశోధనలతో నూతన శిఖరాలను అధిరోహించాలని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణారావు అన్నారు.
ఏపీ నిట్‌లో టెక్రియా 2025 ప్రారంభం
తాడేపల్లిగూడెం అర్బన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని, వినూత్న పరిశోధనలతో నూతన శిఖరాలను అధిరోహించాలని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణారావు అన్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో టెక్రియా 2025 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి నూతన ఆవిష్కరణలను చేపట్టాలన్నా రు. ఆలోచనలకు పదును పెడితే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చన్నారు. కొలు వుల సాధనకు నైపుణ్యాలే కీలకమన్నా రు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థు లకు ఎంతో ఉపయుక్తం అన్నారు. అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వరరెడ్డి కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం ఇన్‌చార్జి డైరక్టర్ రమణా రావును శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమం లో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కే.హిమబిందు కార్య దర్శి వేదంత రెడ్డి, డీన్‌లు వి.సందీప్, ఎన్.జయరాం, కార్తీక్ శేషాద్రి, వీరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు
నిట్ విద్యాసంస్థల్లోని క్లబ్‌లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంకేతిక ప్రదర్శనలు, గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈఈఈ అసోసి యేషన్ ఆధ్వర్యంలో ఎక్స్‌పో, నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నేచర్ హంట్, స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గన్ షూటింగ్, రింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో టెక్నికల్ క్విజ్, 3డీ ప్రింగ్ లేజర్, ఎన్ర్గోవింగ్, ఫొటోగ్రఫి ఆధ్వర్యంలో విజన్ టెక్ తదితర కార్యక్ర మాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలను తిలకించేందుకు పలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు భారీగా హాజరయ్యారు.
స్మార్ సిటీ ప్రత్యేక ఆకర్షణ
సివిల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తక్కువ ప్రదేశంలో భవన సముదాయాలతో నిర్మించిన స్మార్ట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఆదా, సోలార్ పవర్ సిస్టం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం అంశాలతో నిర్మించిన భవన నిర్మాణ నమూనాలు ఆకట్టుకున్నాయి. భవనం లోపలికి అడుగు పెట్టగానే లైట్లు వెలిగే విధంగా.. తిరిగి బయటకు వెళ్లగానే లైట్లు ఆరిపోయే విధంగా సాంకేతికత విద్యార్థుల ప్రతిభను చాటింది.ల
ఆకట్టుకున్న డ్రోన్ చాలెంజ్
మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ చాలెంజ్ గేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ గేమ్‌లో ఐదు దిశలుంటాయి. ఇవి ఎత్తుగాను, పల్లంగాను, గుండ్రంగా దగ్గరి దగ్గరగా ఉంటాయి. గేమ్‌లో పాల్గొన్న వ్యక్తి రిమోట్ సాయంతో డ్రోన్ నడుపుతూ కింద పడిపోకుండా నిర్ణీత సమయంలో ఐదు దశలను దాటుకుని ముందుకు వెళ్లాలి. ఎవరైతే తక్కువ సమయంలో నిర్దేధిత లక్ష్యంతో చేరిన వారిని విజేతలుగా ప్రకటించారు.