Share News

మార్గదర్శకం మీ ఇష్టం!

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:35 AM

ఉపాధ్యాయుల నుంచి మూకుమ్మడిగా నిరసనలు, వ్యతిరేకత చుట్టుముడుతుండటంతో పీ–4లో టీచర్లు మార్గదర్శకులుగా రిజిస్ట్రేషన్‌ కావాలంటూ జిల్లా విద్యాశాఖ గత శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సోమవారం ఉపసంహరించుకుంది.

మార్గదర్శకం మీ ఇష్టం!

పీ–4లో బాధ్యతలు ఐచ్ఛికమేనంటూ సవరణలు

తొలుత జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరణ

శాంతించిన ఉపాధ్యాయులు

ఏలూరు అర్బన్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి):ఉపాధ్యాయుల నుంచి మూకుమ్మడిగా నిరసనలు, వ్యతిరేకత చుట్టుముడుతుండటంతో పీ–4లో టీచర్లు మార్గదర్శకులుగా రిజిస్ట్రేషన్‌ కావాలంటూ జిల్లా విద్యాశాఖ గత శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సోమవారం ఉపసంహరించుకుంది. పీ–4లో గుర్తిం చిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీచర్లను ఎలాంటి ఒత్తిడి చేయబోమని, తమ ఉత్త ర్వులు కేవలం ఆసక్తివున్న వారికి మాత్రమేనని వివ రణనిచ్చింది. ప్రజల ఆర్థిక అసమానతలను తొలగిం చేందుకు పీ–4(పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్‌ పార్టనర్‌షిప్‌) పేరిట ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమంలో మార్గదర్శకులుగా జిల్లాలో మండలానికి 190 మంది హెచ్‌ఎం/స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ఉపాధ్యాయులు చొప్పున రిజిస్టర్‌ కావాలంటూ గత శుక్రవారం జిల్లా విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా ఆది వారం వైరల్‌కాగా, టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం విదితమే. విద్యాశాఖ ఉత్తర్వు లను వ్యతిరేకిస్తూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యా య ఎమ్మెల్సీ గోపిమూర్తి తక్షణమే పీ–4 బాధ్యతల నుంచి టీచర్లను తప్పించేలా సంబంధిత ఉత్తర్వుల ను నిలుపుదల చేయకపోతే ఉపాధ్యాయ సంఘాల ను కలుపుకుని ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. ఇదికాస్తా విద్యాశాఖలో కలకలాన్ని రేపడంతో జిల్లా అధికారులు సోమవారం అప్రమత్తమయ్యారు. పీ–4లో మార్గదర్శకులుగా రిజిస్టర్‌ కావడమనేది స్వచ్ఛందం మాత్రమేకాగా, దానికి విరుద్దంగా ఎందు కు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారులను రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. మరోవైపు జిల్లా సర్వోన్నతాధికారి ఇదే విషయమై విద్యాధికారులను నిలదీసినట్టు సమాచారం. దీంతో తొలుత జారీచేసిన ఉత్తర్వులు కేవలం ప్రైవేటు పాఠ శాలల యాజమాన్యాలను పీ–4లో భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశించినవే తప్ప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై ఎక్కడా ఒత్తిడి తేలేదని వివరణ ఇచ్చుకుంటూ, సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలి సింది. ఇదే విషయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి తెలిపి వివరణ ఇవ్వడంతోపాటు, గత శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సవరణ ఉత్తర్వులను డీఈవో వెంకటలక్ష్మమ్మ సోమ వారం మఽధ్యాహ్నం జారీచేశారు. పీ–4లో మార్గదర్శ కులుగా రిజిస్టర్‌ కావడమన్నది టీచర్ల అభీష్టానికే పరిమితమని, ఆసక్తివున్నవారు స్వచ్ఛందంగా రిజిస్టర్‌ కావచ్చని వివరణ ఇచ్చారు. ఆ మేరకు గతంలో జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటు న్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించడానికి కలెక్టర్‌ వ్యతిరేకమని డీఈవో వివరించారు.

తదుపరి కార్యాచరణను వాయిదా వేసుకున్న టీచర్స్‌ జేఏసీ

ఉత్తర్వులను ఉపసంహరించుకున్న దృష్ట్యా సోమవారం సాయంత్రం ఏలూరు డీఈవో కార్యాలయం వద్ద నిర్వహించతలపెట్టిన ధర్నాను టీచర్స్‌ జేఏసీ వాయిదా వేసుకుంది. పీ–4లో ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా రిజిస్టర్‌ చేయించాలంటూ జిల్లా విద్యాశాఖ గత శుక్రవారం రూపొందించిన ఉత్తర్వులు ఎంఈవోలకు, ఇతర విద్యాధికారులకు పంపలేదని, ఈలోగానే ఎవరో వాటిని బయటకు లీక్‌ చేయడంతోనే సమస్య వచ్చిపడిందని జిల్లా అధికారులు తనకు వివరణ ఇచ్చారని ఎమ్మెల్సీ గోపిమూర్తి తెలిపారు. ఇదే విషయమై వైరల్‌ అయినట్టుగా చెబుతున్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డీఈవోను ఆదేశించినట్టు కలెక్టర్‌ తెలిపారని ఎమ్మెల్సీ వివరించారు. కాగా పాఠశాల విద్యాశాఖకు సంబంధంలేని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను విద్యాశాఖ అనుమతిలేకుండా భాగస్వాములను చేయరాదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సూచనలు జారీచేశారు.

Updated Date - Jul 29 , 2025 | 12:35 AM