ఆత్మీయ సందడి
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:03 AM
‘తల్లుల అభిప్రాయాలు తీసుకోవాలి.. టీచర్లు ప్రణాళిక చెప్పాలి’ అనే ఆలోచనతో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది.
ఆట పాటలు.. ఆత్మీయ సమ్మేళనాలతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
1,960 పాఠశాలలు, 121 కళాశాలల్లో విద్యార్థులు, తల్లులతో నిర్వహణ
భీమవరం రూరల్, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘తల్లుల అభిప్రాయాలు తీసుకోవాలి.. టీచర్లు ప్రణాళిక చెప్పాలి’ అనే ఆలోచనతో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. జిల్లాలోని 1,960 పాఠశాలలు, 121 జూనియర్ కళాశాలల ప్రాంగణాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. పాఠశాలల్లోకి తల్లులను ఉపాధ్యాయులు ఆహ్వానించడం నుంచి కార్యక్ర మం పూర్తయ్యే వరకు సమన్వయంతో సాగాయి. ప్రతి పాఠశాలలోను తల్లులందరూ మీటింగ్‌కు హాజరయ్యారు. వారి పిల్లల వివరాలను తెలపడంతోపాటు ఏ విధమైన మార్పు లు చేస్తే బాగుంటుందో సలహాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యాబోధనలో ప్రణాళిక, క్రమశిక్షణపై వివరించారు. ఈ మీటింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేసేందుకు ఉపయోగకరంగా ఉం టుందని తల్లిదండ్రులు అభిప్రా యపడ్డారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పేరెం ట్స్, టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థుల చదువు చర్చతోపాటు తల్లులకు నిర్వహించిన క్రీడలు ఆకర్షణగా నిలిచాయి. మ్యూజిక
ల్ చైర్స్, ముగ్గుల పోటీలు వంటి క్రీడల్లో తల్లులు ఉత్సాహం గా పాల్గొన్నారు. వారు వయసును మరిచి పిల్లల మాదిరి పోటీ పడ్డారు. ప్రతిభ కనబర్చిన తల్లులకు బహుమతులు అందించారు. చిన్నారులు గ్రూప్ డ్యాన్సులు చేశారు. పాటలు పాడారు. పూర్వపు విద్యార్థులు ఈ మీటింగ్‌కు హాజరైన వారు ఆయా పాఠశాల ల్లో సాధించిన ప్రతిభను తెలపడంతోపాటు ఏ లక్ష్యంతో ముందుకు సాగాలన్నది సూచనలు ఇచ్చారు. ‘తల్లికి వందనం’ ద్వారా ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోందని తల్లులు స్పష్టం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో కలిసి తల్లులు తిన్నారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు : మంత్రి నిమ్మల
పాలకొల్లు అర్బన్/రూరల్, జూలై 10(ఆంధ్రజ్యోతి):‘నేడు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడంతోపాటు ఉత్తమ విద్య అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వ లక్ష్యం పనిచేస్తోంది. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వానికి రంగులు, బొమ్మల పిచ్చి లేదు’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలోని బీవీఆర్‌ఎం హైస్కూల్, లంకలకోడేరు జడ్పీ హైస్కూల్, ఉల్లంపర్రు ఆదిత్య జూనియర్ జూనియర్ కళాశాలల్లో గురువారం జరిగిన మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం తగ్గించేందుకు ‘తల్లికి వందనం’ అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి ఒకొక్కరికి రూ.13 వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. విద్యార్ధులు ఇళ్ల దగ్గర సెల్‌పోన్‌లతో కాలయాపన చేయకుండా సమయపాలనను పాటించి పోటీతత్వంతో విద్యలో రాణించాలన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన స్వాగత ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాలకొల్లు డీసీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు, ఎంఈవోలు జి.వీరాస్వామి, గంగాధరశర్మ తదితరులు పాల్గొన్నారు.