మీరు వచ్చేయండి టీచర్..
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:11 AM
అంకితభావంతో పనిచేస్తే పిల్లలు, పెద్దల మనసులో చోటు సంపాదించుకోవచ్చని ఆ టీచర్ నిరూపించారు.

బదిలీ అయిన ఉపాధ్యాయురాలి వద్ద విద్యార్థుల కంటతడి
సిద్ధాపురం పాఠశాలలో పిల్లల ప్రేమకు టీచర్ భావోద్వేగం
ఆకివీడు రూరల్ జూలై 4(ఆంధ్రజ్యోతి): అంకితభావంతో పనిచేస్తే పిల్లలు, పెద్దల మనసులో చోటు సంపాదించుకోవచ్చని ఆ టీచర్ నిరూపించారు. ఆకివీడు మండలం సిద్ధాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయు రాలు ప్రసన్నదుర్గ 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల దుంపగడప పాఠశా లకు బదిలీ అయ్యారు. మరో టీచర్‌కు చార్జి అప్పగించడానికి శుక్రవారం ఆమె సిద్ధాపురం పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులు ఆమెను చుట్టుము ట్టారు. మీరు వెళ్లకండి టీచర్.. ఇక్కడకే వచ్చేయండి టీచర్.. అంటూ కంట తడి పెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటితో టీచర్‌ను పలకరిం చారు. వారి అభిమానంతో ఉపాధ్యాయురాలు కూడా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలు ఇంత ప్రేమ చూపడంతో తన జన్మధన్యమైందని ఆమె అన్నారు. అనంతరం ఉపాధ్యాయురాలిను అభినందించి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు అప్పారావు, సహేదా, పద్మ, పార్వతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.