స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:02 AM
‘రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయ ఢంకా మోగించి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా అంది స్తాం’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి
ఏలూరు రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయ ఢంకా మోగించి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా అంది స్తాం’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సోమవారం మంచి రోజు కావడంతో ఆయన ఏలూరులోని జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాపై ఉంచి న గురుతర బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం చేసేందుకు కృషి చేస్తాను. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయ కులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీని ఎదురు లేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తా. రఫా.. రఫా అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకేత్తిస్తున్న వైసీపీ నాయ కులు, కార్యకర్తల ఆట కట్టించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడ వల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, కైకలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు వీరమల్లు నరసింహరావు, కొడాలి వినోద్ పాల్గొన్నారు.