Share News

సంస్థాగత టెన్షన్‌!

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:13 AM

టీడీపీలో సంస్థాగత టెన్షన్‌ ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన కమిటీల కసరత్తు సుదీర్ఘ కాలం తర్వాత ఎట్ట కేలకు అధిష్ఠానం ముగింపు ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమైంది. ప్రధానంగా కూటమి పార్టీలతో పాటే టీడీపీ బలో పేతం దిశగా జిల్లా కమిటీల ప్రకటనకు తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న లేదా 18న జిల్లా కమిటీల ప్రకటన ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.

సంస్థాగత టెన్షన్‌!

16 లేదా 18న ప్రకటనకు అవకాశం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

టీడీపీలో సంస్థాగత టెన్షన్‌ ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన కమిటీల కసరత్తు సుదీర్ఘ కాలం తర్వాత ఎట్ట కేలకు అధిష్ఠానం ముగింపు ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమైంది. ప్రధానంగా కూటమి పార్టీలతో పాటే టీడీపీ బలో పేతం దిశగా జిల్లా కమిటీల ప్రకటనకు తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న లేదా 18న జిల్లా కమిటీల ప్రకటన ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.

టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, కమిటీల, అనుబంధ సంఘాల కూర్పు పై తుది కసరత్తును అధిష్ఠానం చేప ట్టింది. అఽఽధ్యక్ష పదవి ఓసీ, బీసీ మధ్య నలుగుతోంది. పొరుగు జిల్లాల సమీకర ణాలతో ముడిపడి ఉండడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రానున్న రెండేళ్ల కాలానికి జిల్లా కమిటీ, 18 అనుబంధ కమిటీల కూర్పుపై జిల్లాల నుంచి త్రీమెన్‌ కమిటీలు ఇప్పటికే అధిష్ఠానానికి నివేది కలు సమర్పించాయి. జిల్లా టీడీపీలో కీలక నేతలు, చాలాకాలం నుంచి పార్టీ జెండాలు మోసే రెండో తరం నాయ కులు, యువత, మహిళలంతా సంస్థా గతంలో పదవులు దక్కుతాయా.. అన్న ఒత్తిడిలో ఉన్నారు. యువతకు పెద్దపీ ట వేసే దిశగా జాతీయ కార్యదర్శి లోకేశ్‌ అడుగులు వేస్తుండడంతో ఆయన కోటాలో జిల్లాలో ఎంతమందికి పార్టీ పదవులొస్తాయోనన్న ఆసక్తి నెల కొంది. వైసీపీ నుంచి జిల్లాలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారికి ఒక శాతం జిల్లా కమిటీల్లో చోటు కల్పించే యోచనలో ఉన్నారు. ఇక మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుతో వారికి సునాయాసంగా అనుకున్నవారందరికి ఆయా పదవులు దక్కనున్నాయి.

సంఖ్య పెంపుతో ఊరట

జిల్లా కమిటీల్లో ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కాకుండా 32 మంది సభ్యులుండగా, ఆ సంఖ్యను 40కు పెంచాలని నిర్ణయించడంతో అరడజను పదవులు పెరిగినట్లే. జిల్లా కార్యవర్గం లో ఓసీలు 34 శాతం, బీసీలు 41 శా తం, ఎస్సీలు 7 శాతం, ఎస్టీలు 3 శాతం, ఇతరులు 4 శాతం ఉండాలి. ఇదిలా ఉండగా జిల్లా కమిటీలో అధ్యక్ష పదవి ఆశించిన వారికి ఈ కేటాయింపుల్లోనే సంతృప్తి పరిచే రీతిలో పదవులను కట్టబెట్టే యోచనలో ఉన్నారు. సోషల్‌ మీడియా, మీడియా కన్వీనర్లకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల్లో బీసీ నాయకత్వానికి ప్రతీ నియోజకవర్గంలో అగ్ర తాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీలో బీసీలకు సముచిత న్యాయం చేస్తామని చంద్రబాబు, లోకేశ్‌లు ప్రకటిస్తున్నారు. దీంతో అన్ని కమిటీల్లోనూ వీరికి ప్రత్యేక స్థానం కల్పించే కూర్పు ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజక వర్గాలైన కైకలూరు, పోలవరంల్లో నియోజకవర్గ ఇన్‌చార్జులను మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమా లను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లే నాయకత్వాన్ని సిద్ధం చేసినట్టు తెలిసింది.

Updated Date - Dec 13 , 2025 | 12:13 AM