సైకిల్ సారథి.. ఎవరు?
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:34 AM
తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టింది. చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకత్వాన్ని మార్చడమా, లేక కొనసాగించడమా అనే విషయంలో తుది నిర్ణయం దిశగా అభిప్రాయ సేకరణకు దిగింది. అందరి అభిప్రాయాలను నమో దు చేయబోతున్నారు. ఆ తర్వాత అధిష్ఠానానికి నివే దిక అందించబోతున్నారు.
ఏలూరులో నేడు కీలక సమావేశం
మంత్రి గొట్టిపాటితో సహా పరిశీలకుల రాక
కార్యకర్తలు, నేతల నుంచి అభిప్రాయ సేకరణ
గన్నితో పాటు చింతమనేని, ఘంటా మురళి పేర్ల ప్రస్తావన
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సీనియర్ల ఆరా
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా టీడీపీ కొత్త నాయకత్వ బాధ్యతలను అప్పగించే దిశగా కార్యాచరణకు దిగింది. 2019 తర్వాత ఒకేసారి అప్పట్లో పార్లమెంట్ స్థాయిలోనే అధ్యక్షుడిని ఎంపిక చేశారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనాతో అన్ని పార్టీల్లో కదలికలు నిలిచి పోయాయి. ఆపై ఎన్ని కలు ముంచుకురావడంతో ఉన్న నాయకత్వంతోనే వ్యవహారం నడపాలని ఏమార్పులు, చేర్పులు చేయ లేదు. సంసా ్థగతంగా మరింత బలపడేలా సాధ్యమై నంత మేర ఏకాభి ప్రాయం ద్వారానే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా అంటే ఇప్పుడున్న జిల్లాల వారీగా నూతన అఽధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఈ దిశగానే జిల్లాలో నేడు కీలక సమావేశం జరగనుంది.
తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టింది. చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకత్వాన్ని మార్చడమా, లేక కొనసాగించడమా అనే విషయంలో తుది నిర్ణయం దిశగా అభిప్రాయ సేకరణకు దిగింది. అందరి అభిప్రాయాలను నమో దు చేయబోతున్నారు. ఆ తర్వాత అధిష్ఠానానికి నివే దిక అందించబోతున్నారు. ఇప్పటికే జిల్లాకు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ జమానాలో పార్టీ కార్యక్ర మాలను విజయవంతంగా నిర్వహించడంలో గన్ని కొంత సక్సెస్ సాధించారు. నియో జకవర్గాల వారీగా పార్టీలో నిస్తేజం అలముకున్న నేపథ్యంలోనూ ఉత్సాహవంతులైన కార్యకర్తలతోనే వైసీపీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నడుం బిగించారు. అప్పట్లో గన్ని వీరాంజనేయులుతో పాటు ఫైర్ బ్రాండ్ చింతమ నేని ప్రభాకర్ పేర్లు వినిపించాయి. కానీ ప్రభాకర్ జిల్లా నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో గన్ని నాయకత్వం వైపే టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపింది. గత ఐదే ళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా సారఽథ్యం వహిస్తున్నా రు. ఈ మధ్య కాలంలో పార్టీలో చిన్నా,చితకా విభే దాలున్నా ఒక్క గాడిన పెట్టడం, వర్గాల మధ్య సమ న్వయానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యారు. గడిచిన ఎన్నికల సమయంలో తనకు పోటీ చేసేం దుకు అవకాశం లేకపోయినా పార్టీ అఽధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం, ఇతరత్రా వ్యవహా రాలను సమన్వయం చేశారు. ఈ కారణంగానే ఈ మధ్యనే గన్నికి స్థానిక సహకార సంఘం, డీసీసీబీ, ఆప్కాబ్ చైర్మన్‌గా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చింది. పార్టీ పరంగా ఆయన కు లభించిన అతిపెద్ద బహు మతి ఇది.
ఇప్పుడేం జరగబోతుంది..
ప్రస్తుత పార్లమెంటరీ నియో జకవర్గాలే జిల్లాలుగా ఉండడం తో ఆ మేరకే అధ్యక్షులను ఆయా పార్టీలు నియమిస్తున్నాయి. అయితే తెలుగుదేశం మాత్రం వ్యవస్థాగతంగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆపై తుది ప్రకటన చేయా లని భావిస్తోంది.ఈ కారణంగా పార్టీలో సమన్వ యం, ఏకాభిప్రాయం సాధ్యం కావడమే కాక విభే దాలకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ముగ్గురు పరిశీలకులను ఖరారు చేసి, వారిని ఆయా జిల్లాల సమావేశాలకు పంపను న్నారు. ఏలూరు సమీపాన ఆదివారం ఒక కల్యాణ మండపంలో జరిగే సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, కన్వీనర్లు, పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న వారు పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. సమావేశం లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బుద్దా నాగజగదీశ్‌లు, సీనియర్లు పాల్గొని అందరి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వాస్తవా నికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏ సామాజిక వర్గానికి చెందిన నేత ఉంటే బాగుంటుందో ఆరా తీస్తున్నారు. ఓసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత జిల్లా అఽధ్య క్షుడు గన్ని వీరాంజనేయులుకే వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే అనుకూలత వ్యక్తమవుతోంది. అయితే ఈ మధ్యనే ఆయనకు డీసీసీబీ, ఆప్కాబ్ చైర్మన్ వంటి పదవులు లభించడంతో తిరిగి ఆయన్నే కొనసాగిస్తారా అనేది తేలబోతుంది. సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరును మరికొందరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి పూర్తిగా అండగా నిలబడే నేత అవసరమని ఆ సత్తా ప్రభాకర్‌కు ఉందనేది మరికొందరి వాదన. ఇంకోవైపు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేరు అధ్యక్ష రేసులో ప్రస్తావనకు వస్తోంది. ఆయన అనుచరులు కూడా ఇలాంటి డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. చంటి మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై నోరు విప్పలేదు. కొందరేమో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి , బీసీ వర్గాల నుంచి జంగారెడ్డిగూడెంకు చెందిన శ్యామ్‌చంద్రశేషుకు అవకాశం ఇవ్వాలని అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే అత్యధికులు అభిప్రాయా లను ఆయా నియోజకవర్గాల నేతలు రాబట్టినట్టు సమాచారం. ఇంకోవైపు సాధ్యమైనంత మేర ఒకరిద్దరి పేర్లను సూచించాల్సిందిగా పరిశీలకులకు ఆదేశాలందినట్టు చెబుతున్నారు.