Share News

జోష్‌ ఏదీ?

ABN , Publish Date - May 15 , 2025 | 12:53 AM

తెలుగుదేశం ప్రతీసారి మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగానే భావిస్తుంది. మహానాడు కంటే ముందు ఈ నెల 17లోపు సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని ఇంతకుముందే టీడీపీ మార్గనిర్దేశం చేసింది.

  జోష్‌ ఏదీ?

మహానాడుకు ముందు కమిటీల ఏర్పాటులో వెనుకంజ

కమిటీల నియామకంలో తప్పటడుగులు

బూత్‌ దగ్గర నుంచి క్లస్టర్‌ వరకు ఇదే పరిస్థితి

దూకుడుగానే ఉంగుటూరు

పోలవరం, కైకలూరుల్లో

పూర్తిగా వెనుకబాటు

అధినాయకత్వం

నివ్వెరపడేలా పార్టీ నేతల వైఖరి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

తెలుగుదేశం ప్రతీసారి మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగానే భావిస్తుంది. మహానాడు కంటే ముందు ఈ నెల 17లోపు సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని ఇంతకుముందే టీడీపీ మార్గనిర్దేశం చేసింది. సంస్థాగతంగా పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేం దుకు నిర్దేశించిన మార్గంలో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ వెను బడ్డాయి. మరికొన్ని ముక్కుతూ, మూలుగుతూ గ్రామస్థాయిలో కమిటీలకు సిద్ధం అయ్యాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత, మహానాడు ఆర్భాటంగా సాగాల్సిన తరుణంలో సంస్థాగత ఎన్నికలు చల్లబడడం ఈ సారి ఆల్‌టైమ్‌ రికార్డు. అయినా గమ్యం చేరుకోవడానికి అన్ని నియోజకవర్గాలు పోటీపడుతూనే ఉన్నాయి.

మహానాడు..ఈ పదం వినబడితే చాలు. సగటు తెలుగు దేశం కార్యకర్త ఉర్రుతలూగుతాడు. మండుటెండను లెక్క చేయకుండా పసుపుజెండాను భుజానికెత్తుకుని ముందు కురుకుతాడు. ఇలాంటి తరుణంలో వయోభేదం ఉండదు. అంతలా క్షేత్రస్థాయి నుంచి ఉప్పొంగిపోతారు. ప్రత్యేకించి అధికారంలో ఉన్న, లేకపోయినా మహానాడంటే దేనిని లెక్క చేయరు. సొంత ఖర్చులతోనే పయనం అవుతారు. ఈసారి ఐదేళ్ల జగన్‌ సామ్రాజ్యంను కూకటివేళ్లతో పెకిలించి, మార్పుకు స్వాగతం పలుకుతూ, అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదిది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీ అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తల నుంచి నేతల వరకు పార్టీ ఆదేశమే శిరోధార్యంగా భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు మహా నాడు కంటే తాము సూచించిన కమిటీలు నియోజక వర్గం నుంచి క్షేత్రస్థాయి వరకు నియమా కాలు పూర్తి చేయాలని, ఇంతకముందే వివిధ నియోజకవర్గాల బాధ్యులను ఆదేశిం చారు. కానీ ఇప్పటికీ సరైన గడువు లేని తరుణంలో పలు నియోజకవర్గాలు ఈ అంశంలో దూసుకెళ్లాయి.

ఉంగుటూరు నియోజక వర్గంలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుం డగా, ఇదే నియోజకవర్గంలో టీడీపీ బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ కన్వీనర్ల నియామకంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఈ నియోజకవర్గ ఇన్‌చార్జి గన్ని వీరాంజనేయులు తమ సమర్థతను చాటారు. రాష్ట్రస్థాయిలోనే ఉంగుటూరు నియోజకవర్గం బుధవారం నాటికి ఏడో స్థానంలో నిలిచింది. బూత్‌ స్థాయిలో కమిటీల నియమాకంలో జిల్లాలో తొలి వరుసలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో పార్టీ ఇప్ప టికీ వివిధ కమిటీల నియమాకంలో ఏయే నియోజకవర్గాలు ముందు వరుసలో ఉన్నాయా, లేక వెనుకబడి ఉన్నాయా అనేది ఏరోజుకారోజు టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తూనే వచ్చిం ది. ఈ క్రమంలోనే బూత్‌, క్లస్టర్‌, యూని ట్‌ల ఏర్పా టులో రాష్ట్ర స్థాయిలో ఉంగు టూరు నియోజకవర్గంలో ఏడో స్థానంలో నిలవగా, ప్రస్తుతానికి ఏలూరు 19, చింతలపూడి 29, దెందు లూరు 64 స్థానాల్లో ఉన్నాయి. పార్టీ ఆదేశానుసారం నియోజ వర్గాల్లో కమిటీల నియమాకాలు జెట్‌ స్పీడ్‌లో సాగాల్సి ఉండగా, ఇలాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. జిల్లాను ప్రాతిపదిక గా తీసుకుంటే ఉంగు టూరు తొలి స్థానంలో, కైకలూరు చిట్టచివరి స్థానాల్లో నిలిచాయి. తొలుత కుటుంబ సాధికార సారఽథులు నియ మాకంలో అనేక నియోజకవర్గాల్లో తడబాటే కనిపించింది. పార్టీ నిర్దేశించినట్లుగా ప్రతీ 50 మందికి ఒక్కరు చొప్పున సారథులను నియమించాల్సి ఉంది. దీనిలో జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు వెనుకబడి ఉండటంతో పార్టీ గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో నేతలను అప్రమత్తం చేశారు. ఏలూరు, దెందులూరు నియోజక వర్గాల్లో కమిటీలు పూర్తి చకచకానే సాగుతోంది.

ఆ ..రెండింటిలోనూ వెనుకడుగే..

క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటులో కైక లూరు, పోలవరం నియోజకవర్గాల్లో వెనుకు బాటుతనం కనిపిస్తోంది. గతంలో గ్రామ కమిటీల దగ్గర నుంచి నియోజ కవర్గం వరకు ఎడాపెడా వేసేవారు. కానీ ఈసారి పోలవరం నియోజక వర్గంలో గత ఎన్నికల్లో జనసేన, కైకలూరులో బీజెపీ తమ ఎమ్మెల్యే లను గెలిపించుకున్నాయి. దీంతో టీడీపీ కైకలూరులో పట్టు కోల్పోయింది. కనీసం కమి టీల ఏర్పాటు దిశగా ముందడగు వేయలేక పోతున్నారు. రాష్ట్రస్థాయిలో కైకలూరుకు 146వ స్థానం దక్కగా, పోలవరానికి 124వ స్థానం దక్కింది. ఆఖరికి బూత్‌ కమిటీల దగ్గర నుంచి ఏ ఒక్కస్థానంలోనూ కమిటీ వేయలేక కైకలూరులో పూర్తిగా చతికిల పడ్డా రు. ఈ దశకు రావడానికి పార్టీ అధి నాయ కత్వం ముందు నుంచి జాగ్రత్త పడక పోవ డం ఒక కారణమైతే, క్షేత్రస్థాయి నేతలు కాడి పడేయడం ఇంకో కారణం. జిల్లాలో కైకలూ రు పూర్తిగా దిగజారిపోతే, పోలవరం అంతం త మాత్రంగా నడుస్తోంది. ఇక్కడ 284 బూత్‌ కమిటీలకు కేవలం 13 వేసి చేతులు దులుపుకున్నారు. క్లస్టర్‌, యూనిట్స్‌ల్లోను ఇదే పరిస్థితి. ఏలూరు జిల్లా మిగతా నియో జకవర్గాల్లో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉం డగా ఈ రెండింటిలో పూర్తిగా నిరాశాజనకం.

Updated Date - May 15 , 2025 | 12:53 AM