మహా సందడి
ABN , Publish Date - May 21 , 2025 | 12:43 AM
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహానాడును ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ అధినాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహానాడు నిర్వహణకు వివిధ కమిటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్లకు అవకాశం కల్పించారు.
నియోజకవర్గాల్లో టీడీపీ మినీ మహానాడు
మహానాడు కమిటీల్లో ఉమ్మడి జిల్లానేతలు
మంత్రి నిమ్మల, తొమ్మిది మందికి చోటు
మినీ మహానాడుకు పోటెత్తుతున్న కార్యకర్తలు
ఆనంద డోలికల్లో ఎమ్మెల్యేలు, కన్వీనర్లు
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహానాడును ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ అధినాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహానాడు నిర్వహణకు వివిధ కమిటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్లకు అవకాశం కల్పించారు. మొత్తం 17 కమిటీలకు 7 కమిటీల్లో జిల్లా నేతలున్నారు. మరోవైపు నియోజక వర్గాల వారీగా కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు మినీ మహానాడు సభలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ మహా సందడిలో ఉన్నాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతిప్రతినిధి)
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెలాఖరున మహానాడు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో మహానాడు నిర్వహ ణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదిలో జరుగుతున్న మహానాడు కావడంతో ఏర్పాట్లు అట్టహాసంగా ఉండాలని భావిస్తున్నారు. కాస్తంత ఉత్సాహం, పట్టుదల ఉన్న నేతలను మహా నాడు కమిటీల్లో నియమిస్తున్నారు.
7 కమిటీల్లో జిల్లా నేతలు
మహానాడుకు ప్రత్యేకంగా 17 కమిటీలు వేయగా, వీటిల్లోని ఏడు కమిటీల్లో ఉమ్మడి పశ్చిమ నేతలు, ఎమ్మెల్యేలనే నియమించారు. పార్టీ కార్యకర్తగా క్రమశిక్షణతో ఎదిగిన నిమ్మల రామానాయుడుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆహ్వాన కమిటీ, సభా ప్రాంగణం, పర్యవేక్షణ కమిటీల్లో ఆయనకు ప్రాతి నిధ్యం కల్పించారు. పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన నేతల్లో మంత్రి నిమ్మల కూడా ఒకరు. భోజనాల ఏర్పాటు కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు చోటు కల్పించారు. ప్రతీసారి పార్టీ కార్యక్రమాల్లో ఈ ఎమ్మెల్యేలిద్దరూ భోజన ఏర్పాట్ల లో చురుకుగా వ్యవహరిస్తారు. తీర్మానాల కమిటీలో సీనియర్ నేత ఎంఏ షరీఫ్, ఫొటో ప్రదర్శన కమిటీలో మాజీ మంత్రి పీతల సుజాత, రవాణా కమిటీలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజుకు అవకాశం ఇచ్చారు. పత్రిక, మీడియా కమిటీలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి, పార్కింగ్ కమిటీలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజును నియమించారు. ఇంతకముందు మహానాడు కమిటీల్లో ప్రత్యేకంగా సీనియర్లకు అవకాశం కల్పించేవారు. కానీ ఈ సారి సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబుకు ఎక్కడా చోటివ్వకపోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో పలువురు సీనియర్లకు వివిధ కారణాలతో వారందరికి చోటివ్వలేకపోయారని చెబుతున్నారు.
నియోజకవర్గాల్లో ఉత్సాహం
మహానాడు నిర్వహణతో టీడీపీ శ్రేణుల్లో పట్ట రాని ఆనందం కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా లో వివిధ నియోజకవర్గాల్లో మినీ మహానాడు సభలు నిర్వహించారు. ఏలూరు, చింతలపూడి, పోల వరం, ఉంగుటూరు, కైకలూరు, భీమవరం, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజక వర్గాల్లో మినీ మహానాడు సభలు ముగిశాయి. ప్రతీ నియోజకవర్గంలో మహిళలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు. గడిచిన ఐదేళ్ల పాటు తాము ఎదుర్కొన్న కష్టాల స్ధానంలో సంతోషం పెరగడానికి పార్టీ గెలుపే కారణమని అనేక మంది మినీ మహానాడులో చెబుతున్నారు. కష్టమైనా, నష్టమైనా పార్టీకి వెన్నంటే ఉంటామని శపధం చేస్తున్నారు. ఇంతకుముందు నిర్ణీత సమ యంలో మినీ మహానాడు నిర్వహించేవారు. ఈ సారి ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుం డగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లు ఉప్పొంగిపో తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో సైతం మినీ మహానాడు సభలు ధీటుగా జరుగుతు న్నాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజవ ర్గాల్లో మినీ మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థ సారథి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, నూజి వీడులో మినీ మహానాడు నిర్వహించాల్సి ఉంది. చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరులో బుధవారం నిర్వహించబోతున్నారు.