టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామరాజు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:02 AM
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామ రాజును ఖరారు చేస్తూ అధిష్ఠానం అధికారి కంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా పితాని మోహనరావును నియమిం చింది.
ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్‌రావు
అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
భీమవరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన రామ రాజును ఖరారు చేస్తూ అధిష్ఠానం అధికారి కంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా పితాని మోహనరావును నియమిం చింది.సామాజిక సమీ కరణలను బేరీజు వేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లాకు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను నియమించగా పశ్చిమగోదావరి జిల్లాకు క్షత్రియ సామాజికవర్గం నుంచి అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. బీసీ సామా జిక వర్గం నుంచి పితాని మోహనరావుకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. త్వరలోనే జిల్లా కమిటీలో అందరి ప్రతినిధులను ప్రకటించనుంది. జిల్లా కమిటీల్లో వివిధ హోదాల్లో ప్రతినిధులను నియమించేందుకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తమ పరిధిలోని నాయకుల పేర్లను అధిష్ఠానానికి పంపారు. అనుబంధ సంఘాలకు నివేదికలు ఇచ్చారు. జిల్లా పార్టీ నుంచి ప్రభుత్వానికి పేర్లన్నీ వెళ్లిపోయాయి. త్వరలోనే అధిష్ఠానం నియామకపు ప్రకటన వెలువరించనుంది. ఇప్పటికే కమిటీల నియామకంలో జాప్యం జరిగిందంటూ కేడర్‌లో ఒకింత అసంతృప్తి నెలకొంది. కేవలం మండల, పట్టణ కమిటీలను మాత్రమే నియమించారు. పట్టణ, మండల అధక్షులకు ఇటీవల రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. పార్టీ సీనియర్లు వీరికి కర్తవ్యభోధ చేశారు. తాజాగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేయడంతో ఇక మిగిలిన కమిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఉపాధ్యక్షులు, కార ్యదర్శులు ఉండేలా పార్టీ నిర్ణయం తీసుకుంది.కమిటీ సభ్యుల పేర్లు కూడా అధిష్ఠానానికి చేరిపోయాయి.