టీడీపీలో సంస్థాగత జోష్
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:15 AM
ఇంటింటి టీడీపీ కార్యక్రమం పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, పథకా లను జూలైలో అందరూ కలిసి ప్రజలకు వివరించి సక్సెస్ అయ్యారు.
గ్రామ, బూత్, క్లస్టర్ కమిటీల ప్రమాణ స్వీకారాలు
జిల్లా అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇచ్చేదెన్నడో ?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఇంటింటి టీడీపీ కార్యక్రమం పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, పథకా లను జూలైలో అందరూ కలిసి ప్రజలకు వివరించి సక్సెస్ అయ్యారు. మధ్యలో పార్టీ వ్యవహా రాల్లోను, నామినేటేడ్ పోస్టుల భర్తీలో కొంతజాప్యం జరగడంతో పార్టీ క్యాడర్ కొంత నిస్తేజమైంది. తాజాగా కమిటీ ప్రమాణ స్వీకా రోత్సవాలను ఈనెల 12,13,14 తేదీల్లో జరపా లని అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి పార్టీలో నూతన ఉత్తేజం నింపినట్లైంది. తొలుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియో జకవర్గంలో కమిటీల ప్రమాణ స్వీకారాలు చేప ట్టారు. అటు తర్వాత ఎటువంటి వివాదా ల్లేకుండా దెందులూరు నియోజకవర్గంలో సీని యర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వ ర్యంలో బూత్ గ్రామ,మండల పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా జరిగా యి. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి నాయకత్వంలో జిల్లా పార్టీ కార్యాల యంలో ఇటీవలే ఈ పండుగ చేపట్టారు. నగర టీడీపీ, అనుబంధ సంఘాల కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు.
పోలవరం, చింతలపూడి ల్లో కొంత ఇబ్బందికరం..
జిల్లాలో పోలవరం, చింతలపూడిల్లో పార్టీ కేడర్‌లో కొంత లుకలుకలున్నట్లు సమాచారం.ఇంకా గ్రామ, మండల, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారాలు ఇక్కడేమి జరగలేదు. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజెపీ శ్రేణులకు తగిన ప్రాధాన్యత లభించట్లేదన్న వాదన ఉంది. దీంతో బూత్, మండల కమిటీ ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. చింతలపూడి లోను ఇదే పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. కైకలూరులో ఫైవ్‌మెన్ కమిటీ ఇటీవల గ్రామ, మండల కమిటీలను పూర్తి చేసింది. మండల స్థాయిలోని కమిటీలను త్వరలో అధిష్ఠానం ప్రకటించే అవకాశాలున్నాయి. నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారఽఽథి ఆధ్వ ర్యంలో కమిటీ లను ఆమోదించారు. ఇక్కడ ఈ వారంలో ప్రమాణ స్వీకారాలను చేసే అవకాశం ఉంది. మరోవైపు నామినేటేడ్ పదవులను అప్పగింత చివర దశకు చేరింది. అక్కడ క్కడ కొన్నిచోట్ల ఇంకా ఈ పదవులు కేటాయింపు ప్రక్రియ ఈ వారం చివర్లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ నామినేటేడ్ పోస్టుల్లో వివిధ డైరెక్టర్ల పదవుల భర్తీని అధిష్ఠానం ఇటీవల చేపట్టింది.
అధ్యక్ష పదవి.. ఎందుకో జాప్యం..
టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎవర్ని ఎంపిక చేస్తారన్నది సర్వత్ర ఉత్కంఠ రేపు తోంది. జూలైలో దరఖాస్తులు స్వీకరించగా, ఇప్పటికి ఎటూ తేల్చలేదు. మరోవైపు ఐవీ ఆర్‌ఎస్ సర్వేలను రెండుసార్లు చేసి మధ్య లో వదిలేశారు. దీంతో ఆశావహులు కొంత అసంతృప్తితో రగలిపోతున్నారు. మునుపెన్న డూ లేని విధంగా అధ్యక్ష పదవికి నాన్చుడి ధోరణిపైన పార్టీలో మల్లగుల్లాలు పడుతు న్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులుతో పాటు ప్రధానంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, దాసరి శ్యామ్‌చంద్రశేషు, పెనుమర్తి రామ్‌కుమార్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల తెరపైకి కైక లూరు సమన్వయ కర్త వీరమల్లు నర సింహారావు పేరు అధిష్ఠానం పరిశీలించింది. ఇందులో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెడతా రన్న ఆసక్తి నెలకొంది. పెట్టుబడుల సదస్సు పూర్తి కావడంతో కీలకమైన పదవులకు ముహూర్తం ఖరారు ఈ వారంలోనే చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.