Share News

ఆస్తులు అధికం.. పన్నులు స్వల్పం

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:19 AM

‘పట్టణాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. మునిసిపాలిటీకి కట్టే పన్నులు మాత్రం నామమాత్రం.

ఆస్తులు అధికం.. పన్నులు స్వల్పం

ఆస్తి పన్నుల్లో లొసుగులు పసిగట్టి

సరిచేయాలని ప్రభుత్వం ఆదేశం

జిల్లాకు రూ.15.82 కోట్లు టార్గెట్‌.. అధికారులు గుర్తించి పన్నులు విధించింది రూ.52 లక్షలు

అంచనాలను అందుకోని యంత్రాంగం..

సర్వే నామమాత్రం.. గడువు 11 రోజులే

భీమవరం టౌన్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి):‘పట్టణాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. మునిసిపాలిటీకి కట్టే పన్నులు మాత్రం నామమాత్రం. ఈ తేడా ఎక్కడ వుంది ? గత ప్రభుత్వం హ యాంలో కొందరు తమ ఆస్తులను తక్కువగా చూపించి, పన్నులు అంతే మొత్తంలో వేయించుకునే వారు. ఫలితంగా మునిసిపాలిటీలు భారీగా ఆదాయాన్ని కోల్పోయేవి. ఇందులో ముందు వరుసలో వున్న మునిసిపాలిటీ భీమవరం. ఇప్పుడు పట్టణాల్లోని ఆస్తి పన్ను చెల్లింపుల్లో లొసుగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదనపు నిర్మాణాలు చేపట్టినా పాత పన్ను లనే చెల్లిస్తూ మున్సిపాలిటీలకు నష్టం పెట్టే వారి ఆస్తులను మదింపు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి మున్సి పాలిటీలోనూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే ఆస్తులను గుర్తిస్తున్నారు. వాటిపై పన్ను పెంచుతూ డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేస్తు న్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఆదాయాన్ని సొంతంగా ఖర్చు పెట్టుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి నిధులపై ప్రభుత్వం అజమాయిషీ తగ్గింది. బిల్లులకు ఎటువం టి అవరోధం ఉండదు. ఇటువంటి వెసులుబాటు కల్పించడం తో ఆదాయం పెరిగితే మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు అభి వృద్ధి చేయవచ్చని ఆశిస్తున్నారు. ఇప్పుడు లొసుగులను సరిచేసి వాటిపై పన్ను వేయడం ద్వారా ప్రతి మున్సిపాలిటీలోనూ 20 శాతం ఆదాయం పెరగుతుందని అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా భీమవరం మున్సిపాలిటీ పెంచాల్సి వుంది. తర్వాత తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం మున్సిపాలిటీలతోపాటు, ఆకివీడు నగర పంచాయతీలోనూ పన్ను పెంపు దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో రూ.15.82 కోట్లు అదనంగా పెంచాల్సి ఉంటుంది.

గతంలో అందరికీ 15 శాతం

గత ప్రభుత్వంలో ఏటా అందరికీ పన్ను పెరుగుతూ వచ్చిం ది. ఇప్పుడు పన్ను తక్కువగా ఉన్న ఆస్తులను పరిగణనలోకి తీసుకుని అదనపు నిర్మాణాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 15లోగా ఆస్తులను మదింపు చేసి అర్హత ఉన్న చోట పన్ను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజులే గడువు ఉంది. గత ప్రభుత్వంలో ఇటువంటి కసరత్తు జరగలేదు. ప్రతి ఆస్తిపైనా 15 శాతం పన్ను పెరుగుతూ డిమాండ్‌ వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి పెద్ద ప్రయాస ఉండేదికాదు. మున్సిపాలిటీల ఆదాయం పెరుగుతూ వచ్చింది. కానీ, పన్ను తగ్గించుకోవడానికి అప్పట్లో సిబ్బందిని ప్రసన్నం చేసుకోవడం, లేదంటే అదనపు నిర్మాణాలు చేపట్టినా పన్ను వేయకుండా తప్పించుకున్నారు. అటువంటి ఆస్తులను ఇప్పుడు గుర్తించాలి. దానికోసం పట్టణాల్లో సర్వే చేస్తున్నారు. ఆస్తి పన్ను నమోదు కానీ ఇళ్లను, పన్ను తక్కువగా నమోదైన ఇళ్లను, గృహ నిర్మాణం కోసం తీసుకుని కమర్షియల్‌గా షాపులు నిర్మించిన వాటిని, కొత్తగా భవనంపై మరో అంతస్తు నిర్మించిన భవనాలను సర్వేలో గుర్తిస్తున్నారు. ఆరు మునిసిపాల్టీల కమిషనర్లతో సమీక్ష పూర్తయ్యింది. ఇచ్చిన లక్ష్యాలను చేరాలని ఆదేశాలు జారీచేశారు. మునిసిపల్‌ రెవెన్యూ విభాగం అధికారులు వార్డుల్లో ఇళ్లను జల్లెడ పడుతున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:20 AM