21న పల్స్ పోలియో
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:05 AM
జిల్లాలో ఈనెల 21న నిర్వహించే పల్స్ పోలియో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
భీమవరం టౌన్,డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 21న నిర్వహించే పల్స్ పోలియో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అందించా లన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పల్స్‌పోలియో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో 0–5 సంవత్సరాల వయసు గల పిల్లలు 1,87,204 మంది ఉన్నారని వీరందరికీ పోలియో చుక్కలు వేయా లన్నారు. 1,315 బూత్‌లను ఏర్పాటు చేస్తారని, 5,520 మందికి విధులు కేటాయించామన్నారు. ఆరోజు వేయిం చకపోతే 22,23 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిం చాలన్నారు. మూడు రోజలుపాటు నిర్వహించే కార్యక్ర మంలో నూరు శాతం లక్ష్యాలను సాధించాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఆర్‌వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఎంహెచ్‌వో గీతాబాయి, ఐసీడీస్ పీడీ శ్రీలక్ష్మీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సదాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం
రక్తం కొరతను తగ్గించేందుకు ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ప్రతి నెల ఒకటి, మూడో శుక్రవారాలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని కోరారు.
14 నుంచి ఇందన పొదుపు వారోత్సవాలు
ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవ గాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి ఇందన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, ఇంజనీర్లు పాల్గొన్నారు.