తమ్మిలేరు ఉధృతి
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:14 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కార ణంగా మంగళవారం ఉదయం నుంచి ఏలూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఏలూరు సిటీ/క్రైం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కార ణంగా మంగళవారం ఉదయం నుంచి ఏలూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలి తంగా తమ్మిలేరు, ఎర్ర కాలువకు వరద ప్రవాహం పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు నాగిరెడ్డి గూడెం ప్రాజెక్టు వద్ద తమ్మిలేరు నీటిమట్టం 347.9 అడుగులు ఉంది. వరద కారణంగా ఏలూరు శనివా రపుపేట కాజ్‌వేపై నుంచి ఉఽధృతంగా ప్రవహిస్తుం డడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోకి 4,719 క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తుండగా 2,710 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు వద్ద నీటిమ ట్టం 82.30 మీటర్లకు చేరడంతో వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. వరద ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులను అప్రమత్తం చేసి నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. తమ్మిలేరు వరద దృష్ట్యా ఏలూరు రూరల్, అర్బన్‌లోని శనివారపు పేట కాజ్‌వే, బాలయోగి వంతె న, తంగెళ్ళమూడి వంతెన ప్రాంతాలను కలెక్టర్ కె.వెట్రి సెల్వి, ఎస్పీ కె.ప్రతాప్‌శివకిశో ర్, మంగళవారం పరిశీలించా రు. తమ్మిలేరు పరివాహక ప్రాంతాలకు ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా తీసు కోవాల్సిన చర్యలు, గట్ల పటిష్ఠతపై అధి కారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ కె.వెట్రి సెల్వి మాట్లాడుతూ ‘జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు, ఎర్రకాలువ, గోదావరి తీర ప్రాంతాలకు, కొల్లేరు వరద ప్రభావానికి గుర య్యాయి. నాగిరెడ్డి గూడెం వద్ద నీటిని విడుదల చేయటంతో తమ్మిలేరు పొంగి ప్రవహిస్తోంది. ఈ కారణంగా చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, చాట్రాయి, ముసునూరు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎర్రకాలువ కారణంగా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండ లాల్లో వరద పరిస్ధితులు ఉంటాయి. అన్ని డివిజ న్ కేంద్రాల్లో లైఫ్ జాకెట్లు, రోప్‌లు సిద్ధం చేశాం. కొల్లేరు లంక గ్రామా ల్లో బోట్లలో ప్రయాణించవద్దు. దీనిపై ప్రజలకు టాంటాం ద్వారా తెలియజేయాలని అధి కారులను ఆదేశించాం. జిల్లా లో వరద పరిస్థితులు తగ్గు ముఖం పట్టే వరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంతో ఉండాలి’ అని ఆదేశించారు. ఎస్పీ కె.ప్రతాప్‌శివకిషోర్ మాట్లా డుతూ తమ్మిలేరు వరద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లో తట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, వరద ప్రవాహం ప్రవహిస్తున్న కాజ్ వేల మీద ప్రయాణించవద్దని సూచించారు. అత్యవ సర పరిస్ధితుల్లో పోలీస్ సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని కోరారు. ఏలూరులోని శనివారపుపేట కాజ్‌వే, సీఆర్‌ఆర్ కాలేజీ సమీపం లోని బ్రిడ్జి, తూర్పులాకులు, పడమర లాకులు, తంగెళ్లమూడి ప్రాంతాలను పరిశీలించారు. ఆర్డీవో ఎం.అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ సీహెచ్ దేవప్రకాష్, నగర పాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
నిడమర్రులో అత్యధిక వర్షపాతం
గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా నిడ మర్రు మండలంలో 29.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామవరపుకోటలో 17.4, ఏలూరు అర్బ న్ 8.2, టి.నరసాపురంలో 7.2, చింతలపూడి 6, ద్వారకా తిరుమల 4.2, లింగపాలెం 3.4, ఉంగుటూ రు 3.4, ఏలూరు రూరల్ 2.8, భీమడోలు 2.6, వేలేరుపాడు 1.6, జీలుగుమిల్లి 1.2, కుక్కునూరు 1.4, పెదవేగి 0.6, దెందులూరు 0.6, జంగారెడ్డిగూడెం, పెదపాడు 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎర్రకాలువ జలాశయంలోకి వరద నీరు
జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో మంగళవారం వరద నీరు భారీగా చేరుకుంది. జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా మంగళవారం 83.35 మీట ర్లకు చేరింది. ఉదయం 3200 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతుండగా జలాశయం మూడు గేట్ల ద్వారా 2200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎర్రకాలువ జలాశ యాన్ని ఆర్డీవో ఎంవి.రమణ, డీఎస్పీ యు.రవి చంద్ర పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ వరద ఉధృతి పెరిగితే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంగిడి గూడెం–రాజవరం సరిహద్దుల్లో ఉన్న ఎర్రకాలువ కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుం డా కాజ్‌వే వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ఉంచామని తెలిపారు.
గోదావరి దోబూచులాట
కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం, సెప్టెంబ రు 2(ఆంధ్రజ్యోతి):గోదావరి వరద దోబూచులాడు తోంది. అల్పపీడన ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు నాలుగు రోజులుగా పెరిగి న గోదావరి నీటిమట్టం మంగళవారం నాటికి నిల కడగా మారింది. ఉదయం భద్రాచలం వద్ద గోదా వరి నీటిమట్టం 40 అడుగులు ఉండగా, సాయం త్రానికి నెమ్మదిగా పెరుగుతూ 41.50 అడుగులకు చేరింది. నాలుగు రోజులుగా గోదావరి నీటిమట్టం పెరుగుతూ, తగ్గుతూ, మరలా స్వల్పంగా పెరుగు తోంది. తెలంగాణలో భారీవర్షాల కారణంగా గోదా వరికి వరద ప్రవహి స్తోంది. వేలేరుపాడు– కొయి దా, రుద్రమ్మకోట–రేపాక గొమ్ము మధ్య రహదారు లు ముంపులో ఉండడంతో 23 గ్రామాలు రాక పోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య వున్న కొండేటి వాగులో లెవిల్ కాజ్ వే ఇంకా నీట మునిగే ఉంది. దీంతో ప్రజలు నల్ల కుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. గోదా వరి తీర ప్రాంతంలో వేసిన వందలాది జామాయిల్ పంట నీట మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 93,1,017 క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.30 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 32.350 మీటర్లు, స్పిల్ వే దిగువన 24.000 మీటర్లు నమోదైంది. పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ వరద జలాలు ఆక్రమించాయి. కడమ్మ స్లూయిజ్ వద్ద వరద జలాలు పెరిగాయి. ఏటిగట్టు కుడి వైపున వున్న కొండవాగుల జలాల నీటిమట్టం పెరిగి పంట పొలాలు నీట మునిగాయి.