Share News

తల్లికి వందనం ఆనందం

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:04 AM

కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన కలపాల ప్రసాద్‌, నిర్మల జ్యోతి దంపతులకు నలుగురు కుమా ర్తెలు, ఒక కుమారుడు. తల్లికి వందనం పథకంలో ఐదుగురికి రూ.65 వేలు తల్లి ఖాతాలో జమ అయ్యాయి.

తల్లికి వందనం ఆనందం

ఐదుగురు పిల్లలకు రూ.65వేలు

పెదవేగి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన కలపాల ప్రసాద్‌, నిర్మల జ్యోతి దంపతులకు నలుగురు కుమా ర్తెలు, ఒక కుమారుడు. తల్లికి వందనం పథకంలో ఐదుగురికి రూ.65 వేలు తల్లి ఖాతాలో జమ అయ్యాయి. పెద్ద కుమార్తె హైమశ్రీ ఇంటర్‌ సెకండియర్‌, రెండో కుమార్తె గాయత్రి పదో తరగతి వట్లూరు గురుకుల విద్యాలయంలో చదువుతున్నారు. మూడో కుమార్తె సుగుణమ్మ 9వ తర గతి, నాలుగో కుమార్తె మహారాణి 7వ తరగతి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. కుమారుడు సుందర్‌ రోచన్‌ మండల పరిషత్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఐదుగురికి రూ.65 వేలు జమ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఒకే కుటుంబంలో నలుగురికి తల్లికి వందనం

పెదవేగి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది. ప థకం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమవడంతో ఆయా కుటుంబాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. పెద వేగికి చెందిన నక్కా వెంకన్న, కోటమ్మలకు నలుగురు పిల్లలు. కుమార్తె దీవెన, పెద్ద కుమారుడు పెద్దిరాజు ఐదవ తరగతి, మూడో కుమారుడు దుర్గారావు 4వ తరగతి, చిన్న కుమారుడు రాజ్‌కుమార్‌ 2వ తరగతి స్థానిక మండల పరిషత్‌ పాఠశాలలో చదువుతున్నా రు. యాచక వృత్తితో జీనం సాగించే ఈ కుటుంబాల్లో చైతన్యం తీసుకొచ్చి, పిల్లలను చదివించేలా ప్రోత్సహిం చడంతో వారంతా పాఠశాలలకు వెళ్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో భాగంగా ఆ నలుగురు పిల్లలకు రూ.52 వేలు అందడంతో ఆ కుటుంబం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇంటిం టికి వెళ్లి భిక్షమెత్తుకునే వారమని, గ్రామ పెద్దలు తమ పిల్లలను బడిలో చేర్పించారని అన్నారు. చింత మనేని చొరవతో తమకు పథకం వర్తించిందని ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు విద్యార్థులకు జాప్యం

ఏలూరు రూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. 8, 9 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 694 మంది తల్లుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు 3186 మందికి కూడా రాలేదు. వారంతా కంగారు పడాల్సిన అవసరం లేదని సాంఘిక సంక్షేమ శాఖ ఈడి ముక్కంటి తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి సమస్య తెలుసుకోవాలని సూచించారు. అనంతరం సమస్య పరిష్కారానికి చర్యలు చేపడితే రెండో విడతలో వస్తుందన్నారు. అర్హుల జాబితాలో ఉండి సొమ్ములు పడకపోయినా ఇబ్బంది లేదన్నారు.

సచివాలయాలలో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌/వార్డు ఎడ్యుకేషనల్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీని సంప్రదించాలని సూచించారు. అర్హుల జాబితాలో ఉన్నా సొమ్ము పడకపోవడానికి ప్రధాన కారణం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)లో ఆధార్‌ అనుసంధానం చేసుకుంటే ప్రభుత్వ పథకాల సొమ్ములు జమవుతాయి. పోస్టాఫీసులో ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)లో ఖాతా తెరిస్తే నగదు జమవుతుందని తెలుస్తోంది.

ఆందోళన చెందాల్సిన పనిలేదు : సోషల్‌ వెల్ఫేర్‌ ఈడీ ముక్కంటి

ఇంటర్‌, 9,10 తరగతిలో విద్యార్థులకు తల్లికి వందనం పడలేదు. నిధులు జమ కాని తల్లులు పోస్టాఫీస్‌లో ఖాతా తెరవాలి. ఇందుకోసం తమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మరో రెండు రోజుల్లో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులందరికీ జమచేసేందుకు చర్యలు చేపట్టాం.

Updated Date - Jun 16 , 2025 | 12:04 AM