భవానీ మాలధారుల ఆందోళన
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:07 AM
భవానీ మాల ధరించి స్కూల్‌కు వచ్చిన విద్యార్థినీని లోనికి అనుమతించకపోవడంతో భవానీలతో కలిసి తల్లిదండ్రు లు ఆందోళనకు దిగడంతో పట్టణంలోని సికిలి స్కూల్ వద్ద బుధవారం నాలుగు గంటలు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నరసాపురం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భవానీ మాల ధరించి స్కూల్‌కు వచ్చిన విద్యార్థినీని లోనికి అనుమతించకపోవడంతో భవానీలతో కలిసి తల్లిదండ్రు లు ఆందోళనకు దిగడంతో పట్టణంలోని సికిలి స్కూల్ వద్ద బుధవారం నాలుగు గంటలు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని భవానీ మాలతో స్కూల్‌కు వచ్చింది. అయితే ఆ విద్యా ర్థినీని స్కూల్ సిబ్బంది తరగతి గదిలోకి అనుమతి ంచలేదు. దీంతో విద్యార్థిని తండ్రి ప్రిన్సిపాల్ సుచరితతో చర్చించారు. కరస్పాండెంట్ అనుమతి తీసుకునే భవా నీని స్కూల్‌కు తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేశా రు. అయితే సిబ్బంది ఒప్పుకోలేదు. సీబీఎస్‌సీ నిబం ధనల ప్రకారం డ్రెస్ కోడ్ తప్పనిసరన్నారు. అవస రమైతే మాల గడవు ముగిసే వరకు విద్యార్థినికి హాజరు వేస్తామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి విద్యా ర్థిని తల్లిదండ్రులు ఆంగీకరించలేదు. ముందుగా లెటర్ పెట్టుకున్న తరువాతే విద్యార్థినికి మాల వేశామని, ఇప్పుడు రూల్స్ చెబితే ఎలా అంటూ వాదానికి దిగారు. అయినప్పటికి సిబ్బంది ఒప్పుకోకపోవడంతో గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలు వురు భవానీలు స్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇటు వీహెచ్‌పీ, విశ్వహిందూ పరిషత్ నాయ కులు కూడా తరలివచ్చి విద్యార్థిని తల్లిదండ్రులకు సంఘీ భావం చెప్పారు. వీరంతా ఆందోళనకు దిగడంతో స్కూల్ వద్ద హై టెన్షన్ నెలకొంది. సమాచారం తెలుసు కున్న ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్‌కుమార్, సీఐలు యాదగిరి, దుర్గాప్రసాద్, ఎస్సై సురేష్ కూడా సిబ్బం దితో స్కూల్ వద్దకు వచ్చారు. ఆందోళన చేస్తున్న వారంతా స్కూల్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరస్వతి దేవి, భరతమాత, అంజనేయస్వామిల చిత్రపటాలు తీసుకెళ్లి స్కూల్ ప్రాంగణంలో పెట్టారు. చివరికి ప్రిన్సి పాల్ సుచరిత రాజీనామా చేస్తున్నట్లు లిఖితపూరికంగా రాసి ఇచ్చారు. మాలతో ఉన్న విద్యార్థినీని లోనికి అను మతించడంతో ఆందోళన విరమించారు. గతంలో కూడా ఇదే స్కూల్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకొన్నది. మళ్లీ మరోసారి వెలుగచూడటం గమనార్హం,