స్వచ్ఛ జిల్లాగా పశ్చిమ
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:28 AM
రాష్ట్రంలో పశ్చిమను స్వచ్ఛ జిల్లాగా మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలు, యువత భాగస్వా మ్యం ఎంతో ముఖ్యమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు.
శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు
భీమవరం టౌన్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో పశ్చిమను స్వచ్ఛ జిల్లాగా మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలు, యువత భాగస్వా మ్యం ఎంతో ముఖ్యమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా పర్యా వరణంలో అవకాశాలు అనే థీమ్‌తో మునిసిపల్ పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో విష్ణు కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి రఘురామ, కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామం, పట్టణం మంచి పర్యావరణంతో నివాసయోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛతపై ముందుకు కదలాలి. తడి, పొడి చెత్తను ప్రజలు వేరువేరుగా అందజేయాలి’ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా రూపు దిద్దేందుకు ఎంతో కృషి చేస్తే నేటికీ కొంత ఫలి తాన్ని సాధించగలిగామని, ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు.
తొలుత ఉప సభాపతి, కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన ఎనిమిది చెత్త సేకరణ ట్రక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. రూ.3.30 లక్షల విలువ కలిగిన ఒక్కొక్క ఆటోను ఏడు నియోజకవర్గాలలోని నరసాపురం వేములవీదేవి వెస్ట్, పేరుపాలెం సౌత్, భీమవరం లోసరి, ఉండి దొడ్డనపూడి, తాడేపల్లిగూడెం మాధవరం, ఆచంట వల్లూరు, పాలకొల్లు పాలకొల్లు రూరల్, తణుకు తేతలి పంచాయతీలకు అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పర్యావరణ హిత ఆవిష్క రణలను స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో అండ్ కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డీపీవో ఎం.రామనాథ్‌రెడ్డి, విష్ణు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ జిల్లా కోఆర్డినేటర్ పి.రోహిత్, తదితరులు పాల్గొన్నారు.