‘సూర్యఘర్ పఽథకం’పై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:56 PM
ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు.
ఏపీ ఈపీడీసీఎల్ డైరెక్టర్ సూర్యప్రకాశ్
భీమవరంటౌన్/కాళ్ల,ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా భీమవ రం వచ్చిన ఆయన ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విద్యుత్. వినియోగదారులకు అంత రాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఏ సబ్ స్టేషన్లపరిధిలో అంతరా యాలు వస్తునాయో ప్రశ్నించారు. కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్తు సబ్‌స్టేషన్‌ల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ సందర్భంగా ఆయనను సిబ్బంది సత్కరించారు. ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయ న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును మర్యాద పూర్వకంగా కలిశారు.
డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన విద్యుత్ శాఖ అధికారులు
డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజును మంగళవారం కాళ్ల మండలం పెద అమిరంలోని ఆయన కార్యాలయంలో ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ పరిధిలోని పలు సమస్యలపై చర్చించారు. ఆకివీడు మండలం పెదకాపవరంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఉండి నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం ఇవ్వడానికి చర్యలను తీసుకోవాలని కోరారు.