Share News

కొల్లేరు ప్రజలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:56 PM

కొల్లేరు గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుం దని ఎవ్వరూ అధైర్యపడవద్దని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి హమీ ఇచ్చారు.

 కొల్లేరు ప్రజలకు అండగా ఉంటాం
లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తున్న మంత్రి పార్థసారథి, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

నిడవర్రు డిసెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): కొల్లేరు గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుం దని ఎవ్వరూ అధైర్యపడవద్దని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి హమీ ఇచ్చారు. ఆదివారం తోకలపల్లి గ్రామంలో సామాజిక భవ నం వద్ద జరిగిన ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు కొల్లేరు భూములలో సాగు నిమిత్తం రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిఽథిగా మంత్రి పార్థసారఽథి హాజరయ్యారు. ఎ మ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడు తూ కొల్లేరు అన్‌సర్వే భూములల్లో ఎన్నో సంవత్సరాల నుంచి స్థానిక ప్రజలు సొసైటీలుగా ఏర్పడి దాళ్వా వరిసాగు చేసుకొంటారని, దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హనీ జరగదని, కావు న మంత్రి ప్రజలకు భరోసా ఇచ్చి సాంప్రదాయ సాగుకు అనుమతించాలని కోరారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కొల్లేరు తీరంలో 72 గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్ళుగా సాగుమీద ఆధారపడుతున్నారని, పర్యా వరణ ఇబ్బందికలగ కుండా వరిసాగు చేసు కొనేలా చూడాలని కోరారు. రాష్ట్ర వడ్డీ కార్పొ రేషన్‌ చైర్మెన్‌ ఘంటసాల వెంకటలక్ష్మీ మాట్లా డారు. అంతకుముందు స్థానికులు సైదు నాగ రాజు, బలే కొండలరావు, గణసల ఆదినారాయణ, ఘంటసాల మహాలక్ష్మిరాజు తదితరులు మాట్లా డుతూ ఎన్నో ఏళ్లుగా తాతల కాలం నుంచి సాంప్రదాయ వ్యవసాయం చేసుకొంటున్నామని తమకు ఇదే జీవనాధారమని వేడుకొన్నారు. రైతుల ఆవేదన విన్న మంత్రి సారథి మాట్లా డుతూ రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, సీఎం చంద్రబాబును కలసి సమస్య పరిష్క రిస్తామన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు శాఖ అధికారి మోహినీ విజయలక్ష్మీ, గంగారత్నం, సర్పంచ్‌ గణసల కృష్ణకుమారి, బలే ధనంజయ పాల్గొన్నారు.

ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు కట్టుకో వడానికి ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం ఫత్తేపు రంలో నూతన కాలనీలో కూటమి ప్రభుత్వ హయాంలో నిర్మించుకొన్న ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వ హించారు. లబ్ధిదారులైన ఇంటి ఇగ్నే ష్‌, పార్వతిలకు మంత్రి సారథి స్వ యంగా తాళం చెవులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్‌ రుద్రరాజు వెంకటేశ్వ రరాజు, సర్పంచ్‌ సాయిప్రియ పాల్గొ న్నారు.

సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

ఆరు గ్రామాల ప్రజలకు, ఆక్వా రైతు ల విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం 4 కోట్లు రూపాయల అంచనాతో నిర్మించన్ను 33 కేవీ సబ్‌ స్టేషన్‌ పనులకు మంత్రి కొలుసు పార్థ సారఽథి, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నీలపాల సాయిప్రియ, ఉపసర్పంచ్‌ రుద్రరాజు వెంకటేశ్వ రరాజు, బాసిరాజు, ఎలక్ట్రికల్‌ ఎస్‌ఈ సాల్మ న్‌రాజు, ఈఈ అంబేడ్కర్‌, ఎడీఈ భీమేశ్వరరావు, ఎఈ రాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 11:56 PM