ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:33 AM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పాలన సాగిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఏంఏ షరీఫ్ అన్నారు.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాలు
నరసాపురం టౌన్, జూలై20(ఆంరఽధజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పాలన సాగిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఏంఏ షరీఫ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 7, 12వ వార్డుల్లో టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, మత్స్యకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజులతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అవగాహన కల్పించారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, ఆచ్యుతామయ్య, సంకు భాస్కర్, వాతాడి ఉమా, నంద్యాల బాబు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్ : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, భవన, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఉండి: డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు అన్నారు. ఆదివారం చిలుకూ రులో ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో కాలువ, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు వేగేశ్న సత్యనారా యణరాజు, సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, పెన్మెత్స భీమరాజు, నంబూరి వెంకట్రాజు, ఇందుకూరి నవీన్‌వర్మ, తిరుపతిరా జు, సత్యనా రాయణరాజు, టీడీపీ మండల ప్రధాన కార్య దర్శి, ఉపాధ్యక్షుడు కళ్లేపల్లి సతీష్‌రాజు, వర్రే సముద్రమూర్తి, పేరిచర్ల బాలరాజు పాల్గొన్నారు.