ప్రజా సహకారంతో సుస్థిర పాలన
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:22 AM
ప్రజాసహకారంతో సుస్థిర పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు 39వ డివిజన్‌లో పర్యటించారు.
ఎమ్మెల్యే బడేటి చంటి
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాలు
ఏలూరుటూటౌన్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రజాసహకారంతో సుస్థిర పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు 39వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అర్హులందరికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నా మన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు అవగాహన పెంచుకుని వారికి రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. రాబోయే నాలుగేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, డిప్యూటీ మేయర్ పుప్ప ఉమామహేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, కో–ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, పలివెల లవకిషోర్, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరురూరల్/దెందులూరు: గత వైసీపీ హయాంలో అక్రమంగా ప్రజాధనాన్ని దోపిడీచేసిన వ్యక్తులు ఎక్కడ దాక్కున్నా వారిపై చర్యలు తీసుకుని ప్రజాధనం రికవరీ చేస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏలూరురూరల్ మండలం పైడి చింతపాడు గ్రామంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రేలంగి యోహాను, మాజీ సర్పంచ్ ఏళ్ల భూషణ్‌రాజు సహా దాదాపు యాభై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే చింతమనేని పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. దెందు లూరు నియోజకవర్గంలోని కొండలరావుపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు పాడుగు నరసిం హారావుతో కలిసి సుపరిపాలనపై తొలిఅడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ నిర్వహించారు. రాట్నాలకుంటలో రాట్నాలమ్మ ఆలయ దేవ స్థానం చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, టీడీపీ నా యకులు, టీడీపీ మండల అధ్యక్షుడు ఈడ్పుగంటి అనిల్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భీమడోలు : గత ప్రభుత్వంలో అస్త వ్యస్తంగా మారిన వ్యవస్ధల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ‘పల్లెపల్లెకు పత్సమట్ల’ కార్యక్రమంలో భాగంగా పోలసానపల్లి, భీమడోలు గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామంలో మరమ్మతులు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ షేక్ హసీనా రహీమాబేగం పాల్గొన్నారు. అనంతరం భీమడో లులో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంత మార్కెట్‌లో నాబార్డ్ సహకారంతో చైతన్య యువజన సంఘం నిర్మించిన మార్కెట్ షెడ్‌ను ప్రారంభించారు. నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, జడ్పీటీసీ టి. భవానీ, సర్పంచ్ పాము సునీత, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో పద్మావతిదేవి పాల్గొన్నారు.