ఇంటి దొంగలు దొరికారు
ABN , Publish Date - May 16 , 2025 | 01:11 AM
నూజివీడు మండ లం సుంకొల్లు గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అవకత వకలపై రూ.76 లక్షలు నిధులు దుర్వినియోగం అయ్యా యని ఈ నెల ఏడో తేదీన ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనం అక్షర సత్యమని నిరూపణ అయ్యింది.
ఆంధ్రజ్యోతి కథనంతో వెలుగులోకి..
మంత్రి పార్థసారథి విచారణకు ఆదేశం
ఐదుగురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు.. రికవరీ యాక్ట్ ద్వారా సొమ్ము వసూలుకు నిర్ణయం
నూజివీడు, మే 15(ఆంధ్రజ్యోతి):నూజివీడు మండ లం సుంకొల్లు గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అవకత వకలపై రూ.76 లక్షలు నిధులు దుర్వినియోగం అయ్యా యని ఈ నెల ఏడో తేదీన ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనం అక్షర సత్యమని నిరూపణ అయ్యింది. దీనిపై స్పందిం చిన మంత్రి కొలుసు పార్థసారథి విచారణకు ఆదేశించా రు. సదరు విచారణలో 2,450 బస్తాల సిమెంట్, 11,952 కేజీల స్టీల్ లబ్ధిదారులకు అందలేదని నిరూపిత మైంది. దీని విలువ రూ.16,52,895లుగా అధికారులు ధ్రువీకరించారు. గృహ నిర్మాణ సంస్థ గోదాముల నుంచి సిమెంట్, స్టీలు విడుదల చేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐదుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరి నుంచి సదరు మొత్తాన్ని రికవరీ యాక్ట్ ద్వారా వసూ లు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఏపీ గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి జి.వి.వి.సత్యనారాయణ తెలిపారు. సదరు సచివాల యం ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పైన చర్యలకు అధికారు లను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామంలో ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు అధికారులు, నాటి వైసీపీ పాలకపక్షం నేతల సహకారంతో మెటీరి యల్‌తోపాటు నగదును డ్రా చేశారు. ఇది ఇంకా వెలు గులోకి రాలేదు. అయితే అధికారులు తొలుత శాఖాప రంగా ఇచ్చిన నివేదికలో 76 లక్షలకు పైగా వుంటుం దని లెక్కలు తేల్చారు. వాస్తవ లెక్కలు అధికారుల టేబుల్‌పై ఉన్నా అవి ఎంత మేరకు బయటకు వస్తా యనేది ప్రశ్నార్ధకంగానే ఉంది.