Share News

ఒక పుస్తకమైనా ఇవ్వండి..

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:15 AM

గ్రంథాలయాలకు ప్రతి ఒక్క రు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక్క పుస్తకమైనా ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

ఒక పుస్తకమైనా ఇవ్వండి..
బహుమతులు అందుకున్న విద్యార్థులతో జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

భీమవరంటౌన్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలకు ప్రతి ఒక్క రు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక్క పుస్తకమైనా ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞా న తరగతులు ఎంతో ఉపయుక్తం అన్నారు. 40 రోజులుగా నిర్వహించిన తరగతుల సందర్భంగా పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందిం చారు. తాను చదువుకునే రోజులలో క్రమం తప్పకుండా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు, న్యూస్‌ పేపర్‌ చదివే వాడిని అని గుర్తు చేసుకున్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల ప్రతిభ పాటవాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, వేసవి విజ్ఞాన తరగతుల కన్వీనర్‌ అల్లు శ్రీనివాసును అభినందించారు. విజేతలకు, పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులను అందజేశారు. కోచింగ్‌ రిసోర్స్‌ పర్సన్స్‌గా వ్యవహరించిన మహమ్మద్‌ సరోజినీ, డాన్స్‌ మాస్టర్‌ శ్యామ్‌ను జేసీ సత్కరించారు.

Updated Date - Jun 07 , 2025 | 12:15 AM