Share News

సొంతింటి కలకు రాయితీ పెంపు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:29 AM

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీని అదనంగా పెంచింది. ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా గతంలో రూ.1.80 లక్షలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల కు రాయితీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సొంతింటి కలకు రాయితీ పెంపు

ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు

మూడో కేటగిరీ ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు మెలిక

ఇళ్లు పూర్తయిన తర్వాత

లబ్ధిదారుల ఖాతాల్లో జమ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీని అదనంగా పెంచింది. ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా గతంలో రూ.1.80 లక్షలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల కు రాయితీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెండిం గ్‌లో ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు

అదనంగా పెంచింది. గతంలో ప్రకటించిన రాయితీతో లబ్ధిదారులు పెద్దగా నిర్మించు కోలేదు. జిల్లాలో 72 వేలు ఇళ్లు కేటాయిస్తే కనీసం 50 శాతం కూడా పూర్తయ్యే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ లబ్ధిదారులకు అదనపు రాయితీలు కల్పించారు.

కాంట్రాక్టర్లకు నోటీసులు

జిల్లాలో మూడో కేటగిరీలో ఇళ్లు నిర్మాణం నిలిచిపో యింది. లబ్ధిదారులు నిర్మించలేమని చెపితే ప్రభుత్వమే నిర్మించేలా కాంట్రాక్టర్‌లను నియమించింది. జిల్లాలో దాదాపు 6,900 ఇళ్లు మూడో కేటగిరీలో నిర్మించాలి. ఇప్పటి వరకు కనీస స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. గత ప్రభుత్వంలో బిల్లులు మంజూరు చేయలేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లులు మంజూరు చేసినా నష్టాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ముఖం చాటేశారు. అటువంటి కాంట్రాక్టర్లకు గృహ నిర్మాణ కార్పొరేషన్‌

నోటీ సులు జారీచేస్తోంది. తక్కువ మొత్తంలో నిధులు కేటాయించినా సరే ఇళ్లు పూర్తి చేస్తామంటూ రంగంలోకి దిగిన కాంట్రాక్టర్లు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా లో కేవలం రూ.1.80 లక్షలకు ఇళ్లు నిర్మాణం సాధ్యపడ దు. అదే ఇప్పుడు కాంట్రాక్టర్‌లను ముచ్చెమటలు పట్టి స్తోంది. ప్రభుత్వం ప్రకటించిన అదనపు రాయితీ కాంట్రాక్టర్‌లకు ఇవ్వడం లేదు. ఇళ్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల కాం ట్రాక్టర్‌లు నిర్మాణానికి ముందుకు రావడం లేదు. మొత్తంపైన కాంట్రాక్టర్‌లకు మెలికపెట్టారు. లబ్ధిదారు లు అదనంగా సొమ్ములు చెల్లించిన ప్రాంతాల్లోనే కాంట్రాక్టర్‌లు నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. తీరా ప్రభుత్వం ఇచ్చే అదనపు రాయతీ లబ్ధిదారుల ఖాతాలో వేస్తామంటూ మెలిక పెట్టడంతో కాంట్రాక్టర్‌లు ఆయోమయంలో పడ్డారు. నిర్మాణాలపై ముందుకు రావడం లేదు.

Updated Date - Jun 04 , 2025 | 12:29 AM