విద్యార్థుల గ్రేడింగ్ నమోదు చేయండి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:15 AM
పాఠశాలలో విద్యార్థుల గ్రేడింగ్ ప్రతి నెల నమోదు చేయాలని డీఈవో నారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. వేండ్ర జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు.
వేండ్ర జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో నారాయణ
పాలకోడేరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో విద్యార్థుల గ్రేడింగ్ ప్రతి నెల నమోదు చేయాలని డీఈవో నారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. వేండ్ర జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాల ప్రార్థన సమయానికి హాజరై పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. పదో తరగతి విద్యార్థులతో కొంత సేపు మాట్లాడారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచన లు ఇచ్చారు. విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచాలని, తల్లిదండ్రుల నుంచి సెలవు చీటీ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. హ్యాండ్ బుక్ ప్రకారం బోధన చేయాలని, ప్రతి సబ్జెక్టులలో ప్రతి విద్యార్థికి బేసికల్ నాలెడ్జ్ ఉండాలన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థుల విష యంలో ప్లానింగ్ ఉండాలని, సబ్జెక్టు వారీగా క్లబ్‌లు ఉండాలని, ప్రతిరోజు ప్రతి విద్యార్థితో వర్క్ చేయించాలని, హోం వర్క్ తప్పనిసరిగా చూడాలని, పదో తరగతి విద్యార్థులతో ప్రతిరోజు, ప్రతి సబ్జెక్టులో ఒక ప్రశ్న రాయించి చదివించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీమన్నారాయణ ఉన్నారు. డీఈవో సూచనలు తప్పనిసరిగా పాటిస్తామని హెచ్‌ఎం జీవీవీ శ్రీనివాస్ అన్నారు. జె.శ్రీనివాసరావు, ఎం.వెంకటరమణ, బోసు బాబు, రాధ, పంపన సాయిబాబు, ఫణిరాజేష్, విశ్వనాథరాజు, రాజవర్ధిని, నాగబాబు, ఏసు బాబు, ఎం.శ్రీనివాసరావు, సునీల్ పాల్గొన్నారు.