అధ్యక్షా..
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:45 AM
జిల్లాలో ఎన్నో సమస్యలు దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచుకోలేదు. భీమవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్ప డటంతో ప్రజల్లో సరికొత్త ఆకాంక్షలు రేకెత్తుతున్నాయి.
ప్రస్తావించనున్న ఎమ్మెల్యేలు
భీమవరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నో సమస్యలు దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచుకోలేదు. భీమవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్ప డటంతో ప్రజల్లో సరికొత్త ఆకాంక్షలు రేకెత్తుతున్నాయి. వాటి పరిష్కారా నికి ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతున్నారు. భీమవరం అర్బన్ డవలప్‌మెంట్ అఽథారిటీ ఏర్పాటుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలి. ఉప్పుటేరు డ్రెడ్జింగ్ కోసం కొత్త ప్రతిపాదనలు చేస్తు న్నారు. సర్వే చేపడుతున్నారు. దీనికి నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు మం జూరు చేస్తోందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరోవైపు కొల్లేరు సరస్సు భధ్రంగా ఉండాలంటే
ఉప్పుటేరుపై రెగ్యు లేటర్లు ఏర్పాటుచేయాలి. వైసీపీ హయాంలో మూడు రెగ్యులేటర్ల నిర్మాణం కోసం సన్నాహలు చేశారు. టెండర్లు పిలిచారు. కానీ పనులు చేయలేకపోయారు. అసెంబ్లీ వేదికగా ఉప్పుటేరు నిర్మాణంపై ప్రజా ప్రతినిధులు ప్రస్తావించనున్నారు.
విమానాశ్రయం.. చిరకాల ఆకాంక్ష
విమానాశ్రయం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష. కూటమి పార్టీలు తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు హామీ ఇచ్చాయి. ఈ మేరకు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, జగన్నపేట గ్రామాల్లో భూములను గుర్తించింది. కాని అడుగు ముందుకు పడలేదు. దీనిని ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెబుతున్నారు.
డెల్టా ఆధునికీకరణ దిశగా..
పశ్చిమ డెల్టా ఆధునికీకరణ అసంపూర్తి గా మిగిలింది. గత ప్రభుత్వాలు రూ.800 కోట్లతో పనులు పూర్తిచేశారు. మరో రూ. 800 కోట్లు వెచ్చిస్తే కాల్వల పూడిక తీత, గట్ల పటిష్టత, రివిట్‌మెంట్ వాల్స్ నిర్మా ణం, మురుగు కాల్వల ప్రక్షాళన వంటి పనులు పూర్తవుతాయి. జిల్లా నుంచి ప్రతి పాదనలు వెళుతున్నా ఉన్నతాధికారులు ఏదో ఒక కొర్రీ వేస్తూ మోకాలడ్డుతున్నారు. దీనిపై దృష్టి సారించారు.
రోడ్ల అభివృద్ధి జరిగేనా
జిల్లాలో రహదారుల అభివృద్ధి మళ్లీ పడకేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదంటూ కొత్త పనులు చేపట్టడంలేదు. ప్రతీ నియోజకవర్గం నుంచి రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు వెళ్లా యి. ఎప్పటిలాగే రోడ్లు గుంతులు పడుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా ఫలితం కానరావటం లేదు. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూ డెం రహదారి అభివృద్ధికి కేంద్రం రూ 100 కోట్లు మంజూరు చేసింది. దానికి పరిపా లనా అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దీనిని పరిష్కరించాలి.
కొలిక్కిరాని కలెక్టరేట్
జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణాలు ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వమే నిఽధులు కేటాయించి భీమవరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నిర్మించాల్సి ఉంది. స్థలాన్ని గుర్తించడంలోను, వివాదం ఏర్పడుతోంది. కూటమిలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాలి.
నిధుల విడుదలపై మాట్లాడతా
తాడేపల్లిగూ డెం నియోజక వర్గ సమస్యల ను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తాను. నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. గూడెం మున్సిపాల్టీలో నిలిచిపోయిన 11 ఎంఎల్ ఫిల్టర్‌ప్లాంట్ పనులు వేగవంతంగా జరిగేందుకు నిధులు విడుదలకు ప్రయత్నిస్తా. కంపోస్టుయార్డు విషయంపైన మాట్లాడతాను.
– తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఉపాధి నిధులు ఎక్కువ కేటాయించాలి
తణుకు నియోజకవ ర్గంలోని పలు అభివృద్ధి పనులకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ నిధులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పక్కనున్న ఏలూరు జిల్లాలో రూ.25 కోట్లు కేటాయిస్తే, పశ్చిమ గోదావరికి కేవలం రూ.5 కోట్లు కేటాయిస్తున్నారు. నిధులు పెంచాలని కోరతా. ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి, తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థల సేకరణకు నిధులు, భవన నిర్మాణం, డీఎల్‌కే రోడ్డు నిర్మాణానికి నిధుల విషయంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తా. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన మాట్లాడతా.
– తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తాగునీటి మీద చర్చిస్తా
సముద్ర తీర ప్రాంతం కావడంతో మండలాల్లో తాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువ. దీన్ని శాశ్వతంగా పరిష్కారించాలంటే కొత్తగా మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాలి. పట్టణంలో 40 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లే ఇంకా కొన్ని వార్డుల్లో ఉన్నా యి. కొత్తగా కుళాయి కనెక్షన్లు పెరిగాయి. 70 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు మార్చాలి. వీటితోపాటు బియ్యపుతిప్ప హార్భర్, వశిష్ఠ వారధి, ఆక్వా యూనివర్సిటీ వంటి పనులు పెండింగ్ పడ్డాయి. పుష్పర పనులపైన అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తా.
– నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నియోజకవర్గం సమస్యలను రాష్ట్ర ప్రభత్వం దృష్టికి తీసుకువెళ్తా. ఇప్పటికే ఎన్నో సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లా. మావుళ్ళమ్మ ఆలయ భద్రత వంటి విషయాలను ప్రస్తావించా. యనమదుర్రుడ్రెయిన్‌పై వంతెనలకు అప్రోచ్‌ల నిర్మాణం అవసరాన్ని వీటన్నింటిని అమలు చేసే విధంగా అసెంబ్లీ దృష్టికి తీసుకుని వస్తా.
– పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు
సమస్యలు ప్రస్తావిస్తా
నక్కల మురు గు కాలువ గోదావరిలో కలిసే లక్ష్మీపా లెం వద్ద గేట్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తా. రహదారుల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించా. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తా.
– ఆచంట ఎమ్మెల్యే, పితాని సత్యనారాయణ