సహకారం..బలోపేతం!
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:03 AM
సహకార రంగాన్ని మరింత బలో పేతం చేసే దిశగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. కేంద్రం సహకార వ్యవస్థలో ఏకీకృతం చట్టం తీసుకురాగా, రాష్ట్రంలో సంఘాల్లో పారదర్శకతకు సొసైటీల కంప్యూ టరీకరణ పూర్తి చేసి, రైతులకు ఆన్‌లైన్ సేవలను తెలుగుదేశం ప్రభుత్వం విస్తరిం చింది.
పెరగనున్న సహ కార సంఘాల సంఖ్య
ప్రస్తుతం జిల్లాలో 153 సంఘాలు..
ఈ సంఖ్య 200కు పెరిగే అవకాశం
పాల ఉత్పత్తి, ఫిషర్‌మెన్ సొసైటీలకు ప్రాధాన్యం
రైతులకు మరింత చేరువగా సేవల విస్తరణ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సహకార రంగాన్ని మరింత బలో పేతం చేసే దిశగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. కేంద్రం సహకార వ్యవస్థలో ఏకీకృతం చట్టం తీసుకురాగా, రాష్ట్రంలో సంఘాల్లో పారదర్శకతకు సొసైటీల కంప్యూ టరీకరణ పూర్తి చేసి, రైతులకు ఆన్‌లైన్ సేవలను తెలుగుదేశం ప్రభుత్వం విస్తరిం చింది. మరో ముందడగు వేసి సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి రాష్ట్రస్థాయిలో కమిటీని ప్రభుత్వం గత నెలలో నియమించింది. దీంతో సొసైటీల విస్తరణ, విభజన జరగనుంది. స్థానిక రైతుల పంట అవసరాలకు అనుగుణంగా రుణాలు, విత్తనాలు, పురుగు మందులను సకాలంలో అందించేందుకు సహకార వ్యవస్థలో సొసైటీలు చేసే సేవలు నిరుపమానం. అయితే గత పాలకులు వైఫల్యాలు, పర్యవేక్షణ లేమితో సొసైటీలు అన్ని మండలాల్లో ఒకే రీతిన లేవు. దీనికి తోడు ఒక మండలంలో ఒక్క సొసైటీ ఉంటే, కొన్ని మండలాల్లో ఏడు నుంచి 10 వరకు ఉన్నాయి. ఒక మండల పరిధిలో 20కి పైగా గ్రామాలున్నా.. ఒకటే సంఘం ఉంది. దీంతో అక్కడి రైతులు పీఏసీఎస్‌ల్లో అవసరాల కోసం 10 నుంచి 20 కిలోమీటర్ల ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో రైతుల సేవలు సక్రమంగా అందడం లేదు. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణ సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పీఏఎస్‌ల ఏర్పాటుపై మండల, జిల్లా స్థాయిల్లోనూ కూటమి పార్టీ నేతల్లో చర్చ మొదలెంౖది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో పీఏసీఎస్‌లను పునర్వ్యవస్థీకరించారు. అప్పట్లో అఽధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల అవసరాల కంటే పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేసింద న్న విమర్శలున్నాయి. ఈ దఫా పునర్వ్యవస్థీకరణలో మండల పరిధి, రైతుల సంఖ్య, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. 2023లో వైసీపీ హయాంలోను పీఏఎస్‌ఎస్‌ల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. మూడు రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అది సాధ్యం కాదని పక్కన పెట్టారు. నాబార్డు నిబంధనల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లను నిర్మాణాత్మక పద్ధతిలో విభజించడం కోసం, సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనికి సహకారశాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యహరిస్తారు. ఆప్కాబ్ ఎండీ మెంబర్ కన్వీనర్‌గా, నాబార్డు సీజీఎం, కృష్ణా డీసీసీబీ, చిత్తూరు డీసీసీబీల సీఈవోలు మెంబర్లుగా నియమిం చారు. వ్యవసాయ విస్తీర్ణం, రైతులు, మౌలిక వసతులను ఆధారంగా ప్రతీ గ్రామంలోను లేదా మూడు గ్రామాలకు కలిపి ఒక్క సొసైటీ అయినా ఏర్పాటు చేసే దిఽశగా సర్వేలకు రంగం సిద్ధం చేశారు. ఏలూరు జిల్లాలో 153 సహకార సంఘాలుండగా, వీటి సంఖ్య పునర్వ్యవస్థీకరణతో 200కు పెరగవచ్చని చెబుతున్నారు.
పునర్వ్యవస్థీకరణలో పాల ఉత్పత్తిదారులు, ఫిషర్‌మెన్ సొసైటీలు
జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఆక్వా రంగం ఉండటంతో ఆయా విభాగాల్లోనూ సొసైటీల ఏర్పాటుకు కసరత్తు చేయనున్నారు. పునర్వ్యవస్థీకరణలో పాల ఉత్పత్తిదారులు, ఫిషర్‌మెన్ సొసైటీలను పెంచనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా త్వరలో దీనిపై నియోజకవర్గాలు, మండలాల వారీగా కసరత్తులు చేయనున్నారు. జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన పునరావాస కాలనీల్లోను కొత్తగా సొసైటీలను ఏర్పాటు చే యడానికి అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై డీసీవో శ్రీనివాస్‌ను ఆంధ్రజ్యోతి సంప్రదించగా పునర్వ్యవస్థీకరణకు ఆదేశాలు వచ్చాయని, దీనిపై త్వరలో కీలక నిర్ణయాలను అధికారులు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకపక్షాలతో కలిసి తీసుకుంటామన్నారు.