Share News

సొమ్ము మాది.. సోకు మీదా!

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:12 AM

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారం భం నుంచే అనేక విభాగాల్లో కష్టాలు ఎదురవు తున్నాయి. రావాల్సిన సొమ్ము రాక, చేసిన అప్పు లు తీరక నానా తిప్పలు. ప్రతీసారి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగిడు తున్నామంటే కొంతలో కొంత మార్పు లు, చేర్పులు ఉండేవి. కాని ఈసారి దీనికి భిన్నంగా తొలి త్రైమాసికం ముగిసినా.. రావాల్సిన నిధులు రానే లేదు.

సొమ్ము మాది.. సోకు మీదా!

పంచాయతీల్లో సెస్‌ సంగతేమిటి..?

నిధుల మాటెత్తితే.. అంతా సైలెంట్‌

తొలి త్రైమాసికం ముగిసినా రాలిపడని నిధులు

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారం భం నుంచే అనేక విభాగాల్లో కష్టాలు ఎదురవు తున్నాయి. రావాల్సిన సొమ్ము రాక, చేసిన అప్పు లు తీరక నానా తిప్పలు. ప్రతీసారి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగిడు తున్నామంటే కొంతలో కొంత మార్పు లు, చేర్పులు ఉండేవి. కాని ఈసారి దీనికి భిన్నంగా తొలి త్రైమాసికం ముగిసినా.. రావాల్సిన నిధులు రానే లేదు. వేలాది మంది భత్యం మీద ఆధారపడి ఉండగా, వీరికి ఇవ్వాల్సిన ఉపాధి వాటా కింద రూ.140 కోట్లు రానేరాలేదు. ఇవాళ, రేపు అంటూ నాన్చివేత. ఇంకోవైపు పల్లెలకు చెందాల్సిన సీనరేజ్‌, గ్రంథాలయ సెస్సు, ఆఖరికి రిజిస్ర్టేషన్‌ సెస్‌ మొఖం చాటేశాయి. ఈ ఏప్రిల్‌ నుంచి విడతల వారీగా రావాల్సిన నిధుల్లేవి రానేరాలేదు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ప్రభుత్వ విభాగాల్లో సొమ్ముకి కటకట. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే సరికొత్త ప్రతిపాదనలు, ఆ మేరకు తగిన నిధులను కేటాయించేవారు. అక్షరాలా ఇస్తామన్న సొమ్మంతా వచ్చేసేది. ఏనాడు రేపు, మాపంటూ తిప్పించుకోలేదు. కానీ రానురాను అన్ని శాఖల్లోనూ ఆనాయితీ తప్పింది. ఆ స్థానంలో విజ్ఞాపనలు పెరిగాయి. ప్రత్యేకించి ఉపాఽధి హామీ కింద ప్రతీరోజు వేల మంది తమకు నిర్దేశించిన పనుల్లో నిమగ్నమవుతూ వచ్చారు. గతంలో వీరికి రావాల్సిన భత్యంను బకాయి పడకుండా చెల్లించేసేవారు. ఆ మేరకు కేంద్రం స్పందించేది. ఏటా నిర్దేశించిన లక్ష్యాల్లో భాగంగా పని రోజులకు సరిపడా నిధులను అందుబాటులో ఉంచేవారు. ఏమైందో ఏమో గానీ, ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ఉపాధి కూలీలకు కష్టాలు ఆరంభమయ్యాయి. రోజూవారీ కూలీ మీదే ఆధారపడే అనేక కుటుంబాలు ఇప్పుడు సొమ్ములు చేతికందక తిప్పలు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బకాయిలు సుమారు రూ.140 కోట్ల మేర కూలీలకు అందాల్సి ఉంది. ఒకవేళ కేం ద్రం విడుదల చేసి ఉంటే ఆ మేరకు కూలీల చేతికి అందాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా నాలుగు న్నర లక్షల మంది జాబ్‌ కార్డుదారులకు సరా సరిన నెలకు 50 లక్షలు పనిదినాలను నమోదు చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటి వరకు రూ.120 కోట్ల నుంచి రూ.130 కోట్లు ఉపాధి కూలీలకు చెల్లించాల్సి ఉంది. ఉపాధి కూలీల ఖాతాల్లో జమ చేసేందుకు జాప్యం జరుగు తుండడం కూలీల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

సెస్‌ ఎక్కడికి పోయింది ?

ఇప్పటికే 14,15 ఆర్థిక సంఘాల ద్వారా సక్రమంగా నిధులు విడుదల కాక పంచాయతీ లన్నీ తిప్పలు పడ్డాయి. ఆఖరికి స్థానిక సంస్థ లకు సెస్‌ రూపేణ అందాల్సిన ఆదాయం అందకుండా పోతోంది. చాలాకాలంగా గ్రంథా లయ సెస్‌ పంచాతీయలకు రాకుండానే పో యింది. ఇదేమని ప్రశ్నించేవారు కరువ య్యారు. ఇంకొందరు మాత్రం పంచాయతీల పరిస్థితి బాగాలేదని, ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని, గత జగన్‌ ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసి ఫలితం లేక మిన్న కుండిపోయారు. ఇప్పుడు తాజాగా గ్రంథాలయ సెస్‌ రాకుండానే మిగిలి పోయింది. సీనరేజ్‌ సెస్‌ విషయంలోను ఇదే పరిస్థితి. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీలకు అందాల్సిన తొలి త్రైమాసిక రిజిస్ర్టేషన్‌ సెస్‌ పెండింగ్‌లో ఉంది. ప్రతీ పంచాయతీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పరిధిలో జరిగే రిజిస్ర్టేషన్‌ల్లో రెండుశాతం సెస్‌గా చెల్లించాలి. మేజర్‌ పంచాయతీల్లో ఈ తరహా సెస్‌ రూపంలో రూ.లక్షల్లోనే ఏటా ఆదాయం ఉంటుంది. కాని ఈసారి ఎందుకో రిజిస్ర్టేషన్‌ సెస్‌ ఇప్పటివరకు పంచాయతీలకు అందలేదు. ఒకవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు అందకుండా పోయిన తరుణంలోనే కాస్తో,కూస్తో ఆదాయంలో భాగమైన రిజిస్ర్టేషన్‌ సెస్‌ ఆ కోవలోకే చేరాయి. వాస్తవానికి సెస్‌ ప్రస్తావన వచ్చేసరికి 2014 ముందు వరకు పంచాయతీలకు బాగానే ఉండేది. అప్పట్లో జిల్లా పరిషత్‌ వేదికగా సెస్‌ల ప్రస్తావన జరిగేది. స్థానిక సంస్థల ప్రతినిధులు నేరుగా నిలదీసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మచ్చు కైనా కనిపించడం లేదు. అయినా తమకు రావాల్సిన వాటాను కోల్పోవడానికి పంచా యతీలు సిద్ధంగా లేవు. వీలు కుదిరినప్పుడల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు వీధుల కెక్కుతూనే ఉన్నారు. పాలనా యంత్రాంగం సాక్షిగా రావాల్సిన సొమ్ము మాదే అయినప్పటికి ఒక పక్క రాజకీయ ప్రతినిధులు, మరో పక్క అధికారులు సోకులకు పోతున్నారనే ఆగ్రహం అందరిలోనూ ఉంది.

Updated Date - Aug 12 , 2025 | 01:12 AM