పెదవేగిలో క్రీడా జట్ల ఎంపిక పోటీలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:08 AM
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్యరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 19 ఏళ్ల విభాగం క్రీడా జట్ల ఎంపిక పోటీలు పెదవేగిలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో బుధవారం ప్రారంభమయ్యాయి.
పెదవేగి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్యరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 19 ఏళ్ల విభాగం క్రీడా జట్ల ఎంపిక పోటీలు పెదవేగిలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో బుధవారం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో వివిధ క్రీడా పోటీలకు సంబంధించి జిల్లా జట్ల ఎంపిక చేస్తామని డీవీఈవో టి.శేఖర్‌బాబు తెలిపారు. తొలిరోజు పోటీల్లో ఆర్చరీ, బాక్సింగ్, జూడో, రగ్బీ, బీచ్ వాలీబాల్, కరాటే తైక్వాండో, ఫెన్సింగ్ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచని క్రీడాకారులతో జిల్లా జట్లను ఎంపిక చేశామని ఆయన చెప్పారు. ఎంపిక పోటీల్లో గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఏవీ.శివప్రసాద్, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.జయరాజు, ఇతర పీడీలు పాల్గొన్నారు.