ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:09 AM
క్లస్టర్ (స్కూల్ కాంప్లెక్స్) కేంద్రంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా క్రీడా సామగ్రి (స్పోర్ట్స్ కిట్స్)ను సరఫరా చేయా లని సమగ్రశిక్ష ఉన్నతాధికారులు నిర్ణ యించారు.
ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు
ఏలూరు అర్బన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): క్లస్టర్ (స్కూల్ కాంప్లెక్స్) కేంద్రంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా క్రీడా సామగ్రి (స్పోర్ట్స్ కిట్స్)ను సరఫరా చేయా లని సమగ్రశిక్ష ఉన్నతాధికారులు నిర్ణ యించారు. విలువిద్య, అఽథ్లెటిక్స్, బ్యాడ్మిం టన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రగ్బీ, సెపక్‌తక్రా, సాఫ్ట్‌బాల్, టెన్నీ కాయిట్, వాలీబాల్, నెట్‌బాల్, ఫెన్సింగ్ తదితర క్రీడలు, ఆటల్లో అవసరమైన 67 రకాల సామగ్రితో కూడిన కిట్లను అంద జేయనున్నారు. క్లస్టర్ హెచ్‌ఎం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్, కార్యదర్శి పర్యవేక్షణలో ఈ క్రీడా సామగ్రిని పాఠశా లలకు పంపిణీ చేస్తారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ తరగతులున్న సీనియర్ సెకండరీ స్కూల్స్‌కు అందజేయనున్నారు. ఈ పాఠశాలలన్నీ జిల్లాలో 112 క్లస్టర్ల పరిధిలో ఉన్నాయి.