Share News

పండుగకు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:55 AM

సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాలకు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి రావడానికి వేలాది మంది తమ ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు.

పండుగకు ప్రత్యేక  రైళ్లు

ఏలూరు క్రైం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాలకు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి రావడానికి వేలాది మంది తమ ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు. రైలు ప్రయాణం కోసం 60 రోజులు ముందు నుంచే రిజర్వేషన్‌ పొందుతున్నారు. అయితే రైళ్లు ఖాళీలేకపోవడంతో రిజర్వేషన్‌ కోసం ప్రయత్నించి ఖాళీలు లేక నిలిచిపోతున్నట్లు నిత్యం రైల్వే డేటా ఉన్నతాధికారుల పరిశీలనలో తెలియడంతో ఇటీవల గోదావరి జిల్లాలకు 41 ప్రత్యేక రైళ్లను సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్నట్లు ప్రకటించి ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈరైళ్లలో కూడా రిజర్వేషన్‌ పూర్తి అయిపోవడంతో మరో 16 ప్రత్యేక అదనపు రైళ్లను గోదావరి జిల్లాల మీదుగా నడపడానికి చర్యలు తీసుకుని మంగళవారం దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌ నుంచి శ్రీకాకుళం నడిచే రైళ్లు చర్లపల్లి, ఖాజీపేట, వరంగల్‌, ఖమ్మం, రాయన్నపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగనున్నాయని తెలిపారు. వికారాబాద్‌ – శ్రీకాకుళం రోడ్డుకు నడిచే రైళ్లు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్‌, చర్లపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు

జనవరి 9, 11 తేదీలలో (రైల్‌ నెంబర్‌ 07288) సికింద్రాబాద్‌ – శ్రీకాకుళం రోడ్డు

జనవరి 10, 12 తేదీల్లో (రైల్‌ నెంబర్‌ 07289) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌

జనవరి 10, 12, 16, 18 తేదీలలో (రైల్‌ నెంబర్‌ 07290) సికింద్రాబాద్‌ – శ్రీకాకుళంరోడ్డు

జనవరి 11, 13, 17, 19 తేదీలలో (రైల్‌ నెంబర్‌ 07291) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌

జనవరి 13వ తేదీలో (రైల్‌ నెంబర్‌ 07294) వికారాబాద్‌– శ్రీకాకుళంరోడ్డు

జనవరి 14వ తేదీ (రైల్‌ నెంబర్‌ 07295) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌

జనవరి 17వ తేదీ (రైల్‌ నెంబర్‌ 07297) సికింద్రాబాద్‌ – శ్రీకాకుళంరోడ్డు

జనవరి 18వ తేదీ (రైల్‌ నెంబర్‌ 07293) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌

రద్దయిన రైళ్లు

విజయవాడ – రాజమండ్రి మార్గమఽ ధ్యలో ఆపరేషనల్‌ వర్స్క్‌ జరుగుతున్న నేప థ్యంలో ఐదు రైళ్లను ఈనెల 23వ తేదీన రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్‌ నెంబర్‌ 17257 విజయవాడ – కాకినాడ పోర్టు, 17258 కాకినాడ పోర్టు – విజయవాడ, 172 50 కాకినాడ టౌన్‌ – తిరుపతి, 17249 తిరు పతి – కాకినాడ టౌన్‌, 67202 విజయవాడ – రాజమండ్రి నడిచే రైళ్లను రద్దు చేశారు.

Updated Date - Dec 17 , 2025 | 12:55 AM