పండుగలకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:11 AM
వివిధ పండుగలను పురస్కరించుకుని ప్రయాణి కుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతు న్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించా రు.
పండుగలకు ప్రత్యేక రైళ్లు
ఏలూరు క్రైం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వివిధ పండుగలను పురస్కరించుకుని ప్రయాణి కుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతు న్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించా రు.మరికొన్నింటిని పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. రైల్ నెంబర్ 07027 చర్లపల్లి – బ్రహ్మపూర్ (ప్రతి శుక్రవారం) ఈ నెల 5వ తేదీ నుంచి నవంబరు 28 వరకు నడపనున్నారు. 07028 బ్రహ్మపూర్ – చర్లపల్లి (ప్రతి శనివారం) 6 నుంచి నవంబరు 29 వరకు, 07225 చర్లపల్లి – షాలిమర్ (కోల్ కత్తా) ప్రతి సోమవారం 1 నుంచి అక్టోబర్ 13 వరకు, 07226 షాలిమర్ – చర్లపల్లి (ప్రతి మంగళవారం) 2 నుంచి అక్టోబరు 14 వరకు, 08439 పూరి – పాట్నా(ప్రతి శనివారం) ఈ నెల 13నుంచి నవంబర్ 29 వరకు నడపనున్నా రు. 08440 పాట్నా – పూరీ(ప్రతి ఆదివారం( 14 నుంచి నవంబరు 29 వరకు, 02811 భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్(ప్రతి శనివారం) ఈ నెల 13 నుంచి నవంబర్ 29 వరకు, 02812 యశ్వంత్ పూర్–భువనేశ్వర్(ప్రతి సోమవారం) సెప్టెంబర్ 15 నుంచి డిసెంబరు 1 వరకూ నడపనున్నారు. 08581 విశాఖపట్టణం – ఎస్‌ఎంవిటి బెంగళూరు (ప్రతి ఆదివారం) ఈ నెల 14 నుంచి నవంబరు 31 వరకు, 08582 ఎస్‌ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం(ప్రతి సోమవారం) ఈ నెల 15 నుంచి డిసెంబర్ 1వరకు, 08547 విశాఖపట్టణం – తిరుపతి (ప్రతి బుధవారం)అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు, 08548 తిరుపతి – విశా ఖపట్టణం (ప్రతిగురువారం) అక్టోబరు 2 నుంచి నవంబరు 27 వరకు, 08579 విశాఖపట్టణం – చర్లపల్లి (ప్రతి శుక్రవారం) అక్టోబర్ 3 నుంచి నవంబరు 28 వరకు, 08580 చర్లపల్లి – విశాఖ పట్టణం(ప్రతిశనివారం)అక్టోబరు 4నుంచి నవం బరు 29వరకు నడపనున్నారు.07219 నర్సాపూర్ – తిరువన్నమల్లయ్ (ప్రతి బుధవారం) అక్టోబర్ 1,8,22, నవంబర్ 5,19,26 తేదీల్లో, 07220 తిరు వన్నమల్లయ్ – నర్సపూర్ (ప్రతిగురువారం) అక్టోబర్ 2, 9, 23 నవంబర్ 6, 20, 27 తేదీల్లో, 06055 పోడనూరు – భరోనీ (ప్రతి శనివారం) సెప్టెంబర్ 6 నుంచి 29 వరకు, 06056 భరోనీ – పోడనూరు(ప్రతి మంగళవారం)ఈ నెల 9 నుంచి డిశంబరు 2 వరకు నడపనున్నారు. 06063 కోయంబత్తూర్ – ధన్‌బాగ్ (ప్రతి శుక్రవారం) ఈ నెల 5 నుంచి నవంబరు 28 వరకు, 06064 ధన్‌బాగ్ – కోయంబత్తూర్ (ప్రతి సోమవారం) ఈ నెల 8 నుంచి డిసెంబరు 1 వరకు, 06077 చెన్నై సెంట్రల్ – సత్రగంజి (ప్రతి శనివారం) ఈ నెల 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు, 06078 సత్రగంజి – చెన్నై సెంట్రల్ (ప్రతి సోమవారం) ఈ నెల 8 నుంచి సెప్టెంబరు 29 వరకు నడప నున్నట్టు అధికారులు తెలిపారు.