Share News

‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:41 AM

పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను కచ్చితంగా నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ ఆదేశించారు.

‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో వెంకట లక్ష్మమ్మ

నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక అమలు

ఉత్తీర్ణత పెరగడానికి మెరుగైన బోధన అందించాలి

హెచ్‌ఎంలతో డీఈవో వెంకట లక్ష్మమ్మ సమావేశం

ఏలూరు అర్బన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను కచ్చితంగా నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ ఆదేశించారు. స్థానిక సుబ్బమ్మదేవి మునిసిపల్‌ హైస్కూలులో ఏలూరు డివిజన్‌లోని 11 మండలాల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో బుధవా రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పది పరీక్షల్లో ఉత్తీర్ణత పెరిగేలా నాణ్యతతోకూడిన బోధన జరిగేలా చూడాలని కోరారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు టీచర్లు వ్యక్తిగత శ్రద్ధతో బోధించాలని సూచించారు. డిసెంబరులో టీచర్లందరూ ఒకేసారి సీఎల్స్‌ ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని, ఆ మేరకు క్యాజువల్‌ లీవులను పెట్టుకునేందుకు మార్గదర్శకాలను పాటించేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ హాజ రుపై సమీక్షించారు. విద్యార్థి సమగ్ర విద్యా సమాచారాన్ని అందజే సేందుకు ఉద్దేశించిన అపార్‌ ఐడీల నమోదు త్వరితగతిన పూర్తిచే యాలన్నారు. అన్ని పాఠశాలల్లో నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలవారీగా ఉపాధ్యాయుల శాం క్షన్డ్‌ పోస్టులు, వర్కింగ్‌, వెకెన్సీల వివరాలను సేకరించారు. డీవైఈవో రవీంద్రభారతి, సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ పంకజ్‌కుమార్‌, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఆశ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటప్పయ్య, హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీకృష్ణ, రవీంద్ర, సమగ్రశిక్ష ఏఎంవో రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:41 AM