Share News

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:51 AM

రానున్న సంక్రాంతి పండుగకు ఆర్టీసీ(ప్రజా రవాణా సంస్థ) ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోం ది.

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈ సారి విజయవాడ, హైదరాబాద్‌ సర్వీస్‌లు

కసరత్తు చేస్తున్న అధికారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రానున్న సంక్రాంతి పండుగకు ఆర్టీసీ(ప్రజా రవాణా సంస్థ) ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోం ది. రద్దీకి అనుగుణంగానే బస్సులు నడపాలన్న యోచనలో ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు జోరందుకుంటున్న తరుణంలో ప్రత్యేక బస్సుల సంఖ్య కుదించే అవకాశం లేకపోలేదు. జిల్లాలో పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ కింద ఏలూరు, నూజి వీడు, జంగారెడ్డిగూడెం నుంచి 309 ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. ఇందులో 170 బస్సులు ఉచితానికి ఉపయో గపడుతున్నాయి. సంక్రాంతి ప్రత్యేక బస్సులు ఎన్ని నడపాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఏలూరు జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాద్‌ వరకు బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. విజ యవాడకు 15 బస్సులు, హైదాబాద్‌లోని పలు ప్రాంతాలకు ఐదు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక బస్సులకు చార్జీలను పెంచే యోచన లేదు. సంక్రాంతి బస్సు సర్వీసు లపై జిల్లా ప్రజారవాణాధికారి షేక్‌ షబ్నంను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా ఈసారి 20 బస్సులను నడపాలని ప్రాఽథమికం గా నిర్ణయించామని, పెంచే యోచన ఉందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఉన్నతాధికారులు నిర్ణయం మేరకు ఈ వారంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Dec 24 , 2025 | 12:51 AM