Share News

కొడుకును హతమార్చిన తండ్రి అరెస్ట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 12:00 AM

మండలంలోని తిరుమలాపురం శివారు వీరన్నగూడెంలో ఈ నెల 26న కన్న కొడుకును హత్య చేసిన తండ్రిని అరెస్ట్‌ చేసి నట్లు సిఐ వి.కృష్ణబాబు గురువారం తెలిపారు.

కొడుకును హతమార్చిన తండ్రి అరెస్ట్‌
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు

జంగారెడ్డిగూడెం, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిరుమలాపురం శివారు వీరన్నగూడెంలో ఈ నెల 26న కన్న కొడుకును హత్య చేసిన తండ్రిని అరెస్ట్‌ చేసి నట్లు సిఐ వి.కృష్ణబాబు గురువారం తెలిపారు. కొయ్యలగూడెం మండలం సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావుకు చికెన్‌ షాపు ఉంది. అతడికి ఇద్దరు కు మారులు. పెద్ద కుమారుడు కొప్పు ల పవన్‌ కుమార్‌ (24) డిగ్రీ పూర్తిచేసి అల్లర చిల్లరగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిస య్యాడు. 9 నెలల క్రితం హైదరాబాదు వెళ్లాడు. తిరిగి తన స్వగ్రామం వచ్చి తనకు రూ.25 వేలు నగదు ఇవ్వాలని లేదంటే ఆస్తి పంచి ఇచ్చే యాలని తండ్రితో గొడవపడి కొట్టాడు. దీంతో తండ్రి నాగేశ్వరరావు కుమారుడిపై కక్ష పెంచు కున్నాడు. ఈ నెల 26న పవన్‌కుమార్‌తో కలిసి పక్క గ్రామం తిరుమలాపురం శివారులో వీరన్న గూడెంలోని నరసయ్య చెరువుగట్టుపై ఉన్న పాకలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కుమారుడికి మద్యం బాగా పట్టించి మత్తులోకి జారుకున్నాక పీక కోసి పరారయ్యాడు. పోలీసులు నిందితు డిని పట్టుకుని కోర్టుకు హాజరు పరచడంతో రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్సై జబీర్‌, ఏఎస్సై సంపత్‌, పీసీలు రమేష్‌, దిలీప్‌ పేర్లు రివార్డు కోసం సిఫారసు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 12:00 AM