Share News

మానవీయ కోణంలో పరిష్కరించండి

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:49 AM

‘కొల్లేరు ప్రజలను నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ ప్రజల సమస్యలను మాన వీయ కోణంలో పరిష్కరించడానికి అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారు లను ఆదేశించారు.

మానవీయ కోణంలో పరిష్కరించండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌, చిత్రంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు వెంకటరాజు, చంటి, ధర్మరాజు, రోషన్‌కుమార్‌, బాలరాజు, కామినేని

త్వరలో మరో ఉన్నతస్థాయి సమావేశం.. నివేదికలతో రండి..

అమరావతిలో కొల్లేరుపై మంత్రి నాదెండ్ల సమీక్ష.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

ఏలూరు జిల్లా సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

ఏలూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘కొల్లేరు ప్రజలను నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ ప్రజల సమస్యలను మాన వీయ కోణంలో పరిష్కరించడానికి అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారు లను ఆదేశించారు. ఇటీవల ఏలూరులో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో కొల్లేరు అటవీ భూములు, ఇతర నియోజకవర్గాల్లోని అటవీ సమస్యలపై ఎమ్మెల్యేలు ఆందోళన స్వరం వినిపించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని మంత్రి నాదెండ్ల అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ క్రమం లోనే శనివారం అమరావతి సచివాలయంలో జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథితోపాటు, ఎమ్మెల్యేలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ‘కొల్లేరు ప్రజలకు తాగు నీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అటవీ సహా ఇతర శాఖలు నిబంధనల పేరుతో అడ్డుపడడం సమంజసం కాదు. కొల్లేరు అటవీ భూముల సరిహద్దుల సమస్యలపై చర్యలు తీసుకోవాలి. అటవీ, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు సమన్వ యంతో పనిచేయాలి. త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తాం. దీనికి పరిష్కార మార్గాలు, చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివే దికలతో హాజరు కావాలి’ అంటూ అధికారుల ను ఆదేశించారు.

సరిహద్దులు నిర్ణయించండి : కొలుసు

తన నియోజకవర్గంలో అటవీ భూములకు సరిహద్దుల సమస్య ఉందని, రెవెన్యూ, ఫారె స్టు అధికారులకు సంయుక్తంగా పరిశీలించి సరిహద్దులను నిర్ణయించాలని మంత్రి కొలు సు పార్థసారథి కోరారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూ ములకు రైతులకు పట్టాలు జారీ చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ ఆర్‌ విషయంలో నిర్వాసితులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వచ్చిన సమస్య లను సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కారం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు.

వెదురు మొక్కల పెంపకానికి మొక్కలు పంపిణీ చేయాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కోరారు.

త న నియోజకవర్గంలో అటవీ భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ కోరారు.

సమస్యలు పరిష్కరించండి

కొల్లేరు లంక గ్రామాల్లో ప్రజలు తాగునీటి కి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ప్రజల సమస్యపై మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీని వాస్‌ సూచించారు.

ఏలూరు రూరల్‌ మండలం మొండికోడు రోడ్డు మరమ్మతులకు అనుమతి మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు.

తన నియోజకవర్గంలో 64 నోటిఫైడ్‌ డ్రెయి న్ల మరమ్మతులకు నిధులు మంజూరుచే యాలని, డ్రెయిన్లను ఏటా డీసిల్టింగ్‌ చేయా లని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మ రాజు కోరారు.

ఏలూరులో వున్న నగర వనానికి ప్రత్యా మ్నాయంగా వేరే విశాల ప్రదేశంలో ఏర్పా టు చేయాలని అటవీ శాఖను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు.

Updated Date - Sep 28 , 2025 | 12:49 AM