గిరిజన గ్రామానికి విద్యుత్ వెలుగులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:25 AM
దట్టమైన అడవిలో గిరిజన ప్రాంతానికి విద్యుత్ వెలుగు వచ్చింది.
మోదేలులో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎస్‌ఈ
కొండరెడ్డి గిరిజనుల ఆనందోత్సాహం
దట్టమైన అడవిలో గిరిజన ప్రాంతానికి విద్యుత్ వెలుగు వచ్చింది. ఏజెన్సీలో మోదేలు గ్రామ గిరిజనులు తరతరాలుగా చీకటిలో మగ్గుతున్నారు. కూటమి ప్రభుత్వం సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఇవ్వడంతో వారి జీవితాల్లో వెలుగు నిండింది.
బుట్టాయగూడెం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాం తంలో మారుమూల గిరిజన గ్రామంలో విద్యుత్ లైటు వెలిగింది. బుట్టాయగూడెం, వేలేరుపాడు మండలాల సరిహ ద్దులో ఉన్న మోదేలు కొండరెడ్డి గ్రామంలో మౌలిక వసతుల కల్పన సాధ్యం కాదని, గ్రామాన్ని ఖాళీ చేయించాలని అధికా రులు భావించారు. గిరిజనులు ససేమిరా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తరతరాల నుంచి విద్యుత్ వెలుగు తెలియని ఆ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం వెలుగు నింపింది. పీఎం జన్‌మన్ పథకంలో భాగం గా 5 కిలోవాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెల్‌ను విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు మంగళవారం ప్రారంభించారు. ఎల్‌టీ లైన్‌తో అనుసంధానం చేయడం ద్వారా మోదేలు గ్రామంలోని 23 కొండరెడ్డి కుటుం బాలకు తొలిసారి విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ వచ్చిన ఆనందంతో గ్రామస్తులు సాంప్రదాయ గిరిజన నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన కూట మి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసిన ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజును ఇతర అధికారులను కొండరెడ్లు పూలమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో ఈఈ పీర్ అహ్మద్‌ఖాన్, ఈఈ టి.శశి ధర్, డీఈ కె.రమేష్, ఏఈ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.