కలెక్టరేట్ మార్గంలో సోలార్ లైటింగ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:26 AM
విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి కలెక్టరేట్, భారతీయ విద్యాభవన్ వరకు సోలార్ ప్యానల్ లైటింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ పరిశీలన
భీమవరం టౌన్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి కలెక్టరేట్, భారతీయ విద్యాభవన్ వరకు సోలార్ ప్యానల్ లైటింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో ఆది వారం పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కళావేదిక పార్కులో కూడా సోలార్ లైటింగ్ ఏర్పాటుకు మునిసిపల్ కమిషనర్ సూచించారు. ఈ నెల 20న జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ రానున్న సందర్భంగా సోలార్ లైటింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి మునిసిపల్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
కలెక్టరేట్‌లో సోమవారం యఽథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వీకరిస్తారని తెలిపారు. ఏదైనా సమాచార కావాలంటే 1100 నెంబరుకు సంప్రదించవచ్చునన్నారు.