మూడో విడతపైనే ఆశలు
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:23 AM
మూడో విడత సహకార సంఘాల త్రిసభ్య కమిటీల జాబితాలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న భీమవరం, నరసా పురం నియోజకవర్గాల జాబితాలను అధిష్టానానికి పంపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు విడతల్లో త్రిసభ్య కమిటీలను ప్రకటించింది.
సొసైటీ త్రిసభ్య కమిటీలకు భీమవరం, నరసాపురం నియోజకవర్గాల నుంచి జాబితాలు పంపిన నేతలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మూడో విడత సహకార సంఘాల త్రిసభ్య కమిటీల జాబితాలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న భీమవరం, నరసా పురం నియోజకవర్గాల జాబితాలను అధిష్టానానికి పంపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు విడతల్లో త్రిసభ్య కమిటీలను ప్రకటించింది. జిల్లాలో 55 సొసైటీలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. మిగిలిన సొసైటీలకు ఎప్పుడు ప్రకటిస్తారా అని కేడర్ ఎదురు చూస్తోంది. జిల్లాలో రెండో విడతలో ప్రకటించిన త్రిసభ్య కమిటీలకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. తర్వాత కాల పరిమితి ముగియనుంది. మళ్లీ వారికి ఆరు నెలలపాటు పొడిగించనున్నారు. పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల కాలపరిమితి వరకే ప్రస్తుత త్రిసభ్య కమిటీలు పనిచేస్తాయి. తర్వాత మరోసారి పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగా కేడర్‌కు కూడా సంకేతాలు అందాయి. జిల్లాలో 122 సహకార సంఘాలున్నాయి. ఇప్పటి వరకు 55 సొసైటీలకు కమిటీలను నియమించారు. మరో 67 సంఘాలకు ప్రకటించాలి. త్వరలోనే వాటిని ప్రకటిస్తారు. మరోవైపు దేవాలయాల ట్రస్ట్ బోర్డు పేర్లు పంపడంలోనూ నేతలు బిజీగా ఉన్నారు, తొలుత సహకార సంఘాల జాబితాను పంపేశారు. ఇప్పుడు దేవాలయ పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.
సొసైటీని అభివృద్ధి పథంలో నడపాలి
కాళ్ళ, జూలై 16(ఆంధ్రజ్యోతి): కలవపూడి సొసైటీ అభివృద్ధికి నూత నంగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ కృషి చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు అన్నారు. బుధవారం అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జి సత్యనారాయణ సమక్షంలో కలవపూడి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా మంతెన చిననరసింహరాజు, సభ్యులుగా పెన్మెత్స జానకిరామరాజు, వాతాడి రామారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రఘురామ, రామరాజు మాట్లాడారు. కలవపూడి సొసైటీ రైతులు, ఖాతాదారులు రుణాల రికవరీలో నూరు శాతం వసూళ్లు సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలవడం శుభపరిణామమన్నారు. ఏడు కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ బ్యాంక్ 10 కోట్లకు చేరుకోవాలని కోరారు. సీఈవో కనుమూరు నరసింహరాజు(మణి), మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్నప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, ఎంపీపీ పెన్మె త్స విశ్వనాథరాజు, నంద్యాల రామరాజు, జనసేన మండలాధ్యక్షుడు యేరుబండి రామాంజనేయులు, అడ్డాల శివరామరాజు, కఠారి నరసింహరాజు, డొక్కు సోమేశ్వరరావు, తోట ఫణిబాబు పాల్గొన్నారు.