జనవరి 1 నాటికి.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:39 AM
జిల్లాను స్వర్ణ ఏలూరు– స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడం లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం వహించాలి. జనవరి 1వ తేదీ నాటికి ప్రభుత్వ కార్యాల యాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. సంక్రాంతికి నాటికి జిల్లాలో నూరుశాతం ఇంటింటికి తడి,పొడి చెత్త సేకరణ చేసేలా ప్రణాళికా బద్ధంగా సాగాలి’ అంటూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
కలెక్టర్ వెట్రిసెల్వి..
స్వచ్ఛాంధ్ర అవార్డుల అందజేత
ఏలూరు,అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):‘జిల్లాను స్వర్ణ ఏలూరు– స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడం లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం వహించాలి. జనవరి 1వ తేదీ నాటికి ప్రభుత్వ కార్యాల యాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. సంక్రాంతికి నాటికి జిల్లాలో నూరుశాతం ఇంటింటికి తడి,పొడి చెత్త సేకరణ చేసేలా ప్రణాళికా బద్ధంగా సాగాలి’ అంటూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’లో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు రెండు అవార్డులు, 51 జిల్లా స్థాయి అవార్డులను సాధించిన నేపథ్యంలో ఆయా సంస్థలు, వ్యక్తులు, కార్యాలయాలకు చెందిన వారికి స్థానిక సర్ సీఆర్‌ఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం అవార్డులు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అవార్డుల సాధనతో మరింత రెట్టింపు ఉత్సాహంతో రాబోయే లక్ష్యాల సాధన కు పనిచేయాలి. తడి,పొడి చెత్తలను వేరుచేసి తడిచెత్తను కంపోస్టుగా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగించేలా ప్రజలను చైతన్య వంతులను చేయాలి. జిల్లాలో 50 వేల ఇళ్లలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఏలూరు నగరంలోని డంపింగ్ యార్డులో 80 వేల టన్నులకు పైగా ఉన్న వ్యర్థాల నిర్వహణ చేసి తొలగించాలి’ అని సూచించారు. జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లన్నారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కార్పొ రేషన్ తరపున చర్య లు తీసుకుంటున్నామన్నారు. జడ్పీ సీఈవో శ్రీహరి, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, డీపీవో కె.అనురాధ, డీఎం హెచ్‌వో డాక్టర్ అమృతం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, డీపీటీవో షేక్ షబ్నం, కమి షనర్ భానుప్రతాప్ పాల్గొన్నారు.