Share News

పట్టణాల్లో ప్లాస్టిక్‌ భూతం

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:32 AM

పట్టణాల్లో ప్లాస్టిక్‌ భూతం స్వేచ్ఛగా విహరిస్తోంది.

పట్టణాల్లో ప్లాస్టిక్‌ భూతం

యథేచ్ఛగా ప్లాస్టిక్‌ కవర్ల వాడకం

ఎక్కడపడితే అక్కడ విక్రయాలు

ప్రజలకు తక్షణ సౌకర్యం

అధికారుల నామమాత్రపు చర్యలు

నియంత్రణలో యంత్రాంగం విఫలం

పట్టణాల్లో ప్లాస్టిక్‌ భూతం స్వేచ్ఛగా విహరిస్తోంది. కేన్సర్‌ రూపంలో ప్రాణాలను కబళించే ప్రమాదం ఉందని తెలిసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అధికారులు అలసత్వం వీడడం లేదు. పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గలేదు. వ్యాపారులను విక్రయించవద్దని, ప్రజలను వాడవద్దని అధికారులు చెబుతున్నారు. కవర్లు ఎక్కడ తయారవుతున్నాయి, రవాణా, విక్రయాలపై మాత్రం పర్యవేక్షణ కొరవడింది.

నియంత్రణలో విఫలం

పాలకొల్లు అర్బన్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి):పట్టణం లో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం నియంత్రణలో అధికారుల విఫలమయ్యారు. మునిసిపాలిటీ అధికా రులు కొన్ని రోజులు దుకాణాలపై దాడులు చేసి చేతులు దులుపు కుంటున్నారు. తర్వాత కవర్ల వినియోగం షరా మామూలే. కొన్ని దుకాణల్లో కవర్లు ఇవ్వడం లేదని బోర్డులు పెట్టినా వినియోగదారులు డిమాండ్‌ చేస్తు న్నారు. దీనితో వ్యాపారులు చాటుమాటుగా కవర్లు ఇస్తూనే ఉన్నారు. కింది స్థాయి అధికారులు ప్లాస్టిక్‌ వినియోగం నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు ఉత్పత్తిపై చర్యలు లేకుండా వ్యాపారులపై చర్యలు తీసుకోడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

నిషేధం వట్టి మాట!

భీమవరం టౌన్‌: పర్యావరణానికి ముప్పుగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్ల వాడకం నిషేధం పట్టణంలో వట్టి మాటగా మిగిలింది. దాదాపు 10 నెలలగా నిషేధం అమలులో ఉన్నా పట్టణంలో రోజుకు 80 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణలో ప్లాస్టిక్‌ కవర్లే అధికం. జిల్లా కేంద్రమైన భీమవరం నుంచే ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం అమలుకు కలెక్టర్‌ నాగరాణి శ్రీకారం చుట్టారు. మునిసిపల్‌ అధికారులు దాడులు చేసి వినియోగం, విక్రయాలు కట్టడి చేసినా వాడకం ఆగలే దు. వారం రోజుల క్రితం తోపుడుబండి వ్యాపారి వద్ద జాయింట్‌ కలెక్టర్‌ కవర్లను పట్టుకుని అవగాహన క ల్పించారు. అనంతరం అధికారులతో సమీక్షలో ప్లాస్టిక్‌ నియంత్రణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులు నామమాత్రం

తాడేపల్లిగూడెం: తాడేపల్లి గూడెంలో ప్లాసిక్‌ కవర్ల వాడకం సర్వసాధారణం. కూరగాయలు, కిరాణా దుకాణాలు, పండ్ల బండ్లు, పాల బూత్‌ల వద్ద కవర్ల వినియోగం ఎక్కువగా జరుగుతుంది. అధికారులు నామమాత్రపు దాడులతో పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు సాగుతున్నాయి. చిల్లర వ్యాపారులకు కవర్లను విక్రయించే వారిని మునిసిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 20 మైక్రాన్‌కంటే ఎక్కువ మందం ఉండే కవర్లను వినియోగించే అవ కాశం ఇచ్చారు. కనీసం ఆదిశగా కూడా వ్యాపారులు చేయడం లేదు. ర్యాలీలు ప్రచారాల ప్రభావం ప్రజలలో కనిపించడం లేదు. అధికారులు దాడులు చేసి అధిక మొత్తంలో ఫైన్లు వేస్తే తప్ప అదుపులోకి రావని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

తనిఖీలతో సరి..!

తణుకు: పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గలేదు. తణుకు పట్టణంలో అధికారు లు తనిఖీలతో చేతులు దులిపేసుకుంటున్నారు. ఒకటి, అర కేసులు నమోదు చేసి అపరాధ రుసుము విధించినా కవర్ల వాడకం కొనసాగడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.

తరుచూ దాడులు, జరిమానా

నరసాపురం పట్టణంలో సింగిల్‌ లేయర్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకం నిషేధించాం, తరుచూ తనిఖీ చేస్తున్నాం. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. విక్రయాలు సాగిస్తున్న పలువురు వ్యాపారులకు జరిమానా విధించాం. వ్యాపారులు, ప్రజలకు కవర్ల వాడకంపై అనర్ధాలను వివరించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

అంజయ్య, మునిసిపల్‌ కమిషనర్‌, నరసాపురం

రూ 3.5 లక్షలు జరిమానా

పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకుం టున్నాం. గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్న వారి నుంచి రూ.3.5 లక్షలు జరిమానా వసూలు చేశాం. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నాం. వాటిని గుర్తించి చర్యలు చేపడుతున్నాం. వ్యాపారులకు అవగాహన కల్పి స్తున్నాం. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తున్నాం.

కె.రామచంద్రారెడ్డి, భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Jul 26 , 2025 | 12:32 AM