Share News

సిందూర్‌.. సింహనాదం

ABN , Publish Date - May 08 , 2025 | 12:54 AM

సిందూర్‌ ఈ పదమే అనేక మందిలో రక్తం ఉప్పొంగేలా చేస్తోంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగించాలని ఈ దిశగా సమరనాదానికి దిగితే తాము కూడా సైఅంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పడు అంతటా యుద్ధసన్నద్ధమే.

సిందూర్‌.. సింహనాదం
ఏలూరులో మాక్‌డ్రిల్‌లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

అంతటా యుద్ధ ఆసక్తి, ఉత్కంఠ

స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లపై ఆరా

యుద్ధ వార్తల కోసం నెట్‌లో అన్వేషణ

యూట్యూబ్‌, వాట్సాప్‌ల్లోనూ అత్యధికులు

యుద్ధ సన్నద్ధతపై పలుచోట్ల మాక్‌డ్రిల్‌

అధికారులతో కలెక్టర్‌ వెట్రిసెల్వి సమీక్ష

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

సిందూర్‌ ఈ పదమే అనేక మందిలో రక్తం ఉప్పొంగేలా చేస్తోంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగించాలని ఈ దిశగా సమరనాదానికి దిగితే తాము కూడా సైఅంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పడు అంతటా యుద్ధసన్నద్ధమే. నిన్న, మొన్నటి వరకు పాకిస్థాన్‌పై భారత్‌ బెదిరింపులతో సరిపెడుతుందని అందరూ భావిం చారు. కానీ ఇంకోవైపు ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు సిందూర్‌ పేరిట సింహనాదం చేశారు. ఇంకేముంది ఊరూ, వాడా ఇదే నినాదం. పోలీస్‌ బలగాలు యుద్ధసన్నద్దతపై జిల్లాలో పలుచోట్ల మాక్‌డ్రిల్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమలో అన్నిచోట్ల యుద్ధకథనాలు, సమాచారంపై ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఇప్పటికే భారత్‌ ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సైనికులైతే తామూ కూడా యుద్ధభూమి లో పోరాడేందుకు సిద్ధమేనన్నట్లు సంకేతాలిస్తున్నారు. దీని కితోడు యుద్ధానికి సంబంధించి అన్ని వర్గాల్లోనూ ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగింది. కేంద్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలకు దిగినా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు యూట్యూబుల్లో సరదా రీల్స్‌లో సరిపెట్టుకున్న వారంతా ఇప్పుడు యుద్ధంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నెట్‌లో వస్తున్న అప్‌డేట్‌ల కోసం అన్వేషణ భారీగా పెరిగింది. యుద్ధం లాభ, నష్టాలు, పాకిస్థాన్‌పై యుద్ధం సబబేనా లేదా కాదా అనే అంశాలు చర్చకు వచ్చినప్పుడు యుద్ధ సన్నాహాలకు అనుగుణంగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ తీరుతెన్నులు భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నాయో వ్యాపార వర్గాలన్నీ ఇప్పటికే మునిగితేలాయి. నిత్యావసరాల ధరలు ప్రత్యేకించి చమురు ధరలతోపాటు మరికొన్ని నిత్యవసరాలు చుక్కల నంటే అవకాశం ఉందనే భావన మరింత పుంజుకుంది.

అందరిదీ.. ఆ వైపు చూపే..

బీజేపీతోపాటు మిగతా పార్టీల క్యాడర్‌ యుద్ధ కార్యక్ర మాలపై ఉత్కంఠకు గురవుతున్నాయి. బీజేపీ యుద్ధానికి అనుకూలంగా పిడికిలి బిగిస్తోంది. సోషల్‌ మీడియాలో సాధ్యమైనన్ని పోస్టులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు యుద్ధసన్నద్ధతను ఆమోదించడం లేదు. అంతర్జాతీయంగా ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న తరుణంలో యుద్ధం సబబు కాదనే అభిప్రాయం ఆ పార్టీల్లో వినిపిస్తోంది. సీపీఐ అగ్రనాయకత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రభావం స్థానిక నేతలపై పడింది. టీడీపీ, వైసీపీ ఈ దిశగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోను ఈ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు గుమిగూడితే చాలు పాకిస్థాన్‌ పని అయిపోయినట్లుగానే చర్చకు దిగుతున్నారు. కేంద్రంలో బీజేపీ దూకుడుపై కొందరు ఆమోదం ప్రదర్శిస్తుండగా, ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు.

మాక్‌డ్రిల్‌పై కలెక్టర్‌ సమీక్ష

మాక్‌డ్రిల్‌పై కలెక్టర్‌ వెట్రిసెల్వి ప్రత్యేకంగా సమీక్షిం చారు. గౌతమీ సమావేశం హాల్లో వివిధ శాఖల అధికారుల తో సమీక్షించారు. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ప్రాణరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విపత్తు నివారణ శాఖ, పోలీస్‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిం చారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో సైరన్‌తో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆ సమయంలో పౌరులందరూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. సమావేశంలో జేసీ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.

యుద్ధసన్నద్ధత.. అప్రమత్తం

యుద్ధసన్నద్ధత దిశగా స్థానికుల్ని అప్రమత్తం చేసే పని ఆరంభమైంది. బుధవారం ఏలూరు జిల్లా కేంద్రం తోపాటు పలు మండలాల్లోను మాక్‌డ్రిల్‌ నిర్వహించా రు. హఠాత్తుగా ఎలా తమను తాము కాపాడుకో వాలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా స్థానికులను పోలీసు బల గాలు మరింత అప్రమత్తం చేశాయి. కేంద్రం ప్రక టిం చిన 244 జిల్లాలే కాకుండా ఏలూరు వంటి జిల్లాలోను మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రజలను అప్ర మత్తం చేయ డానికే మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నట్టు ఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంట ర్‌లో జరిగిన మాక్‌డ్రిల్‌ను పెద్దఎత్తున ప్రజలు తిల కించారు.

సిందూర్‌తో ఉగ్రవాదం అంతం

మంత్రి కొలుసు పార్థసారథి

భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికీ పాకిస్థాన్‌కు అర్థ మయ్యి ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇండియన్‌ ఆర్మీ తగిన బుద్ధి చెబుతుంది. ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాదం అంతానికి శాశ్వత పరిష్కారం అడుగులు పడుతు న్నాయి. భారత్‌ సైన్యానికి నా అభినందనలు.

Updated Date - May 08 , 2025 | 12:54 AM